‘జూ’లో పెరిగిన ధరలు… ఇవాళ్టి నుంచి అమలు

నెహ్రూ జులాజికల్‌ పార్క్‌ ఎంట్రన్స్  టికెట్ ధరలను పెంచారు నిర్వాహకులు. ఇవాళ్టి(శుక్రవారం,ఏప్రిల్-12) నుంచి పెంచిన ధరలు అమలు కానున్నాయి. ఇప్పటి వరకు పెద్దలకు రూ.40, చిన్నారులకు రూ.25గా టికెట్ రేట్లు ఉన్నాయిని… అయితే శుక్రవారం నుంచి పెద్దలకు రూ.50, చిన్నారులకు రూ.30 టికెట్ ధరలను వసూలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.  వీకెండ్ సెలవు రోజులైన శని, ఆదివారాల్లో ఎంట్రెన్స్ టికెట్ ధరలు పెద్దలకు రూ.60, చిన్నారులకు రూ.40 వసూలు చేస్తున్నారు. అయితే వాటిని కూడా పెంచారు. పెద్దలకు రూ.80, చిన్నారులకు రూ.50 చేయనున్నారు.

అంతేకాదు పది సీట్ల కాలుష్య రహిత బ్యాటరి వాహనం ప్రత్యేక రైలు కోసం 120 నిమిషాలకు రూ.2 వేలు, 14 సీట్ల వాహనానికి రూ.3 వేలుగా నిర్ణయించారు. స్టిల్‌ కెమెరా రూసుం రూ.30 నుంచి 100కు, వీడియో కెమెరా రుసుం రూ.120 నుండి 500కు పెంచామన్నారు. చిట్టి రైలు రుసుం పెద్దలకు రూ.20, చిన్నారులకు రూ.10… అదే రైలుకు వీకెండ్స్,  సెలవు రోజుల్లో పెద్దలకు రూ.30, చిన్నారులకు రూ.15 వసూలు చేయనున్నారు.

అదేవిధంగా జూలోని గెస్ట్‌హౌస్‌ రుసుం రూ.1000 నుండి 2 వేల వరకు పెంచామన్నారు జూ అధికారులు. ఐదుగురు దాటితే అదనంగా ఒక్కరికి రూ. 200 చార్జ్‌ చేస్తామన్నారు. గెస్ట్‌హౌస్‌ దగ్గర ఉన్న హాలులో 40 మంది ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటలకు సమావేశం నిర్వహించుకునేందుకు రూ. 10 వేల చార్జి వసూలు చేస్తున్నామన్నారు. లయన్‌ సఫారీ పార్క్‌ వాహనం పెద్దలకు రూ.50, చిన్నారులకు రూ.30 ఉండగా వారంతపు సెలవు రోజుల్లో రూ.60 వసూలు చేస్తున్నామన్నారు. సఫారీ వాహనంలో చిన్నారుల టికెట్‌ రూ.30 నుంచి రూ.20కి తగ్గించామన్నారు. అయితే ఈ పెంచిన ధరలన్నీ హెడ్‌ ఆఫ్‌ ది ఫారెస్ట్‌ ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్సర్వేటర్‌ ప్రత్యేక ఆదేశాలతో ధరల పెంపుతోపాటు కొన్ని ప్రవేశాలను ఉచితం చేశామన్నారు నిర్వాహకులు.

Latest Updates