సిటీలో ఆగని యాక్సిడెంట్లు

రెండు ప్రమాదాలు.. ఇద్దరు మృతి
డ్రంకెన్ డ్రైవ్​కు ఒకరు.. ఓవర్ ​స్పీడ్​కు మరొకరు బలి

సికింద్రాబాద్, శేరిలింగంపల్లి (హైదరాబాద్), వెలుగురెండు కారు ప్రమాదాలు.. ఒకరు ఫుల్లుగా మందు తాగి నడిపారు.. మరొకరు అతివేగంగా తోలారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్​తో రెండు ప్రాణాలను బలితీసుకున్నారు. రెండు కుటుంబాలకు పెద్ద దిక్కు లేకుండా చేశారు. బుధవారం హైదరాబాద్​లో ఈ ఘటనలు జరిగాయి. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఫ్రెండ్స్​తో బయటికి వచ్చి..

హైదరాబాద్​లోని బీహెచ్ఈఎల్ టౌన్​షిప్​లో నివసించే ఎండీ అఫ్సర్(40).. సంగారెడ్డి జిల్లా పరిధిలోని కందిలో స్కూల్ ఏర్పాటు చేశారు. దానికి కరస్పాండెంట్​గా ఉన్నారు. ఈయన మంగళవారం రాత్రి 12 గంటల సమయంలో ఫ్రెండ్స్​తో కలిసి మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హఫీజ్​పేట ఫ్లైఓవర్ దగ్గర ఒక హోటల్​కు వెళ్లారు. స్నేహితులు హోటల్​లో ఉండగా.. అఫ్సర్ బయట రోడ్డు పక్కన బైక్ మీద కూర్చుని ఉన్నారు. 12.40 సమయంలో ఆల్విన్​కాలనీ చౌరస్తా నుంచి కొండాపూర్ వైపు వెళ్తున్న ఒక కారు.. అతి వేగంగా వచ్చి బైక్ మీద కూర్చున్న అఫ్సర్​ని ఢీకొట్టింది. గమనించిన స్నేహితులు, స్థానికులు తీవ్ర గాయాలైన అఫ్సర్​ని దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. అతిగా మందు తాగి కారు నడిపిన వ్యక్తిని బీరంగూడలో నివసించే సతీశ్‌గా పోలీసులు గుర్తించారు. ​ కాంట్రాక్టర్​గా పని చేస్తున్న సతీశ్.. మరో ఇద్దరితో కలిసి మంగళవారం రాత్రి మందు తాగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కారు ఢీకొన్న ఘటనలో రెండు బైక్​లు, ఓ కారు ధ్వంసమయ్యాయి. ప్రమాదం తర్వాత ముగ్గురు పరారైనట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. అఫ్సర్​కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మియాపూర్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు
చేస్తున్నారు.

బడికి వెళ్తుండగా..

గాంధీ ఆస్పత్రి దగ్గర్లో గిరిధర్​(40) తన భార్య పిల్లలతో ఉంటున్నాడు. బేగంపేటలోని హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులో మార్కెటింగ్ మేనేజర్​గా పని చేస్తున్నాడు. కొడుకు కార్తికేయన్ మారేడుపల్లిలోని గీతాంజలి స్కూలులో 2వ తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం తన కొడుకును బైక్​పై స్కూల్​కు తీసుకెళ్తుండగా.. అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో బైక్ కారు కింద ఇరుక్కుపోయింది. బైక్​ను కారు అలానే ఈడ్చుకుంటూ వెళ్లి ఫుట్​పాత్​ను ఢీకొట్టింది. దీంతో గిరిధర్, కార్తికేయన్​కు తీవ్రగాయాలయ్యా యి. వెంటనే వీరిద్దరినీ అపోలో ఆసుపత్రికి తరలించగా గిరిధర్ మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. తుకారాంగేట్ పోలీసుస్టేషన్ పరిధిలో రైల్​నిలయం దగ్గర బుధవారం ఈ ప్రమాదం జరిగింది. కార్తికేయన్ పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని జూబ్లీహిల్స్​లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. కారు నడిపిన మహిళను సుర్గు సాగోల్ షెర్​(48)గా గుర్తించారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని, కారును స్వాధీనం చేసుకున్నారు.

see also: భారతీయుడు2 షూటింగ్​లో ప్రమాదం

రీజినల్‌‌ రింగ్‌‌ రోడ్డు ఆగింది!

సర్కార్ ఫోకస్ : రిటైర్మెంట్​ ఏజ్​ 61

Latest Updates