చిన్నారుల్లో రక్తహీనత: బలహీనమవుతున్న బాల్యం

రాష్ట్రంలో బాల్యం బలహీనమవుతోంది. చిన్నా రులను రక్తహీనత, పోషకాహారలోపం వెంటాడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఏదో ఒక స్థా యిలో రక్తహీనతతో బాధపడుతున్నారు. దేశవ్యాప్తంగా 56.8 శాతం చిన్నారులు రక్తహీనత ఎదుర్కొంటుండగా, రాష్ర్టం లో అది 60 శాతం దాటి నమోదవుతోంది. రాష్ట్రంలోని చిన్నారులపై ఇండియన్ ప్రొఫెసర్‌‌‌‌ ఎస్‌‌.వి.సుబ్రమణ్యం , అమెరికా లోని హార్వర్డ్‌‌ స్కూల్‌‌ ఆఫ్ పబ్లిక్‌‌ హెల్త్‌‌ సంయుక్తంగా నిర్వహించిన సర్వే లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

ఖమ్మం లో అత్యధికం….

లోక్ సభ నియోజకవర్గాల వారీగా చేసిన ఈ సర్వే లో రాష్ట్రంలోని 14 సెగ్మెంట్లలో జాతీయ సగటు కంటే ఎక్కువ శాతం పిల్లల్లో రక్తహీనత ఉన్నట్టు గుర్తించారు. ఖమ్మంలో అత్యధికంగా 70.7 శాతం మంది పిల్లలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. మల్కాజ్‌‌గిరిలో అత్యల్పం గా 53.5 శాతం చిన్నారుల్లో సమస్యను గుర్తించారు. ఆ తర్వాత కరీం నగర్‌‌ (56.1), చేవెళ్ల (55.2) మాత్రమే జాతీయ సగటు కంటే దిగువన ఉన్నా యి. రాష్ట్రంలోని  ఐదేండ్లలోపు చిన్నారుల్లో 20 శాతం నుంచి 30 శాతం మంది బరువు, ఎత్తు ఉండాల్సిన దాని కంటే తక్కువగా ఉన్నా రు.

రక్తహీనత అంటే?..

శరీరంలోని రక్తం ఎర్రగా ఉండడానికి కారణం అందులోని హిమోగ్లోబిన్. ఇది తయారవడానికి మాంసకృత్తులు, ఐరన్‌‌, ఇతర పోషక పదార్థా లు తోడ్పడుతాయి. సాధారణంగా మగవారిలో ప్రతి 100 గ్రాముల రక్తంలో 13 గ్రాములు, ఆడవారిలో 12 గ్రాములు, 6 ఏండ్ల లోపు పిల్లల్లో 11 గ్రాములు, గర్భిణుల్లో 11 గ్రాములు, బాలిం తల్లో 12 గ్రాములు, 6 నుంచి 12 ఏండ్ల లోపు పిల్లల్లో 12 గ్రాముల హిమోగ్లోబిన్‌‌ ఉండాలి. ఈ మేరకు హిమోగ్లోబిన్‌‌ స్థాయి అంతకంటే తక్కువ ఉంటే రక్తహీనతగా పరిగణిస్తారు.

పోషకాహార లోపం వల్లే…

రక్తహీనతకు ప్రధాన కారణం పోషకాహార లోపం.చిన్న పిల్లల్లో కడుపులో నట్టలు ఉండటం వల్ల కూడా రక్తహీనత ఏర్పడుతుం ది. గర్భిణులు, పిల్లలకు పోషకాహారం అందించేం దుకు కేం ద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పలు పథకాలను తీసుకొచ్చాయి. రాష్ర్టం లో సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్‌‌) కింద గర్భిణులు, బాలిం తలు, పిల్లలకు గుడ్లు, పాలు, పప్పులు అందజేస్తున్నారు. అయితే ఈ పథకాల అమలులో లోపాలున్నట్టు అనేక ఆరోపణలున్నాయి. నాసిరకం పాలు పంపిణీ చేయడం, రోజూ ఇవ్వాల్సిన గుడ్లను, నెలలో ఒకేసారి లేదా రెండు దఫాల్లో ఇస్తున్నారన్నవిమర్శలున్నా యి.

తొలి రెండేళ్లే కీలకం…..

ఆర్నెల్లు గడవకుండానే చిన్నారులు తల్లిపాలకు దూరమవుతుం డటం కూడా పిల్లల ఆరోగ్యం పై ప్రభావం చూపుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. రెండేండ్ల వరకు పిల్లలకు అన్ని రకాల పోషకాహారాలు అందించాలని సూచిస్తున్నా రు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదలపై తొలి రెండేం డ్లలో అందే పోషకాహారమే అధిక ప్రభావం చూపుతుం ది. పిల్లలకు నాణ్యమైన పాలు, గుడ్లు, పండ్లు అందేలా ప్రభుత్వాలు శ్రద్ధ పెట్టాలని డాక్టర్లు కోరుతున్నారు.

Latest Updates