4 రోజులు.. 486 పాజిటివ్‌‌లు

గ్రేటర్‌‌లో రోజురోజుకూ పెరుగుతోన్న కేసులు
మొదట్లో ఓల్డ్‌‌ సిటీకే పరిమితం
ప్రస్తుతం జీహెచ్‌‌ఎంసీ అంతటా స్ప్రెడ్‌‌
పోలీసులు, హెల్త్ వర్కర్లకూ వైరస్‌‌
లాక్​డౌన్ రిలాక్సేషన్స్, కాంటాక్ట్
  ట్రేసింగ్‌‌ల్లో ఆలస్యమే కారణాలు

హైదరాబాద్, వెలుగు : కరోనా కేసులు మొదట్లో ఓల్డ్ సిటీ నుంచే ఎక్కువ వచ్చినా..ప్రస్తుతం గ్రేటర్ వ్యాప్తంగా  స్ప్రెడ్‌‌  అయ్యింది. గత 4 రోజుల్లో 486   కేసులు రాగా, ఇవి  ఓల్డ్ సిటీ ప్రాంతాల కంటే మిగతా ఏరియాల్లోనే ఎక్కువగా నమోదయ్యాయి.  ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం సుమారు 2 వేల పాజిటివ్‌‌ కేసులున్నాయి. సిటిజన్స్, మైగ్రెంట్స్‌‌తో పాటు పోలీసులు, మెడికల్ సిబ్బంది సైతం వైరస్‌‌ బారిన పడ్డారు. లాక్ డౌన్ కంటే ముందు పరిమిత ప్రాంతాలే కరోనా హాట్ స్పాట్‌‌గా ఉండేవి. రిలాక్సేషన్స్, పాజిటివ్‌‌ ట్రేసింగ్‌‌ల్లో ఆలస్యం, ఎలాంటి సింప్టమ్స్ కనిపించకపోవడం లాంటి వాటితోనే స్పీడ్ గా వైరస్ స్ప్రెడ్ అయినట్టు తెలుస్తోంది. ఢిల్లీ మర్కజ్‌‌ లింక్‌‌లతోనే మొదట్లో ఓల్డ్ సిటీ నుంచే ఎక్కువ కేసులు వచ్చాయి.  కొన్ని ప్రాంతాల్లో కేసులు ట్రేస్‌‌ చేస్తుంటే, మిగతా ప్రాంతాల్లో లింక్‌‌లతో సంబంధం లేకుండా పాజిటివ్ లు వస్తున్నాయి. రిలాక్సేషన్స్ తర్వాత జీహెచ్ఎంసీలోని అన్ని సర్కిళ్లకు స్ప్రెడ్ అయి కేసుల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతోంది.

ఖైరతాబాద్‌‌ జోన్‌‌లోనే అధికం

జీహెచ్‌‌ఎంసీలోని 6  జోన్లలో  ప్రస్తుతం మొత్తం159 హోం కంటెయిన్ మెంట్లు ఉన్నాయి.  చార్మినార్ జోన్ లో 550కి పైగా పాజిటివ్‌‌లు ఉండగా.. సికింద్రాబాద్, ఖైరతాబాద్, శేరిలింగంపల్లి, ఎల్ బీనగర్ జోన్లలో 1,224కి పైగా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఖైరతాబాద్ జోన్ పరిధిలోనే 480కి పైగా పాజిటివ్‌‌లు వచ్చాయి.  కొన్ని రోజులుగా కరోనాకు హాట్ స్పాట్ గా మారిన జియాగూడలో వైరస్ సోకిన వారి సంఖ్య 170 దాటింది.  అంబర్ పేట ఏరియాలో 60 మందికి కరోనా పాజిటివ్‌‌ వస్తే, ఇందులో పోలీస్ సిబ్బంది 20,హెల్త్ ఎంప్లాయీస్, వర్కర్స్ 30 మంది ఉన్నారు. లాక్ డౌన్ రిలాక్సేషన్స్ తర్వాత జనాలు  ఫిజికల్ డిస్టెన్స్ పాటించకపోవడం, పర్సనల్ సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం ద్వారా కేసులు పెరుగుతున్నట్టు తెలుస్తోంది.  ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ లను గుర్తించడం అధికారులకు సవాల్ గా మారింది.

పెరిగిన తీవ్రత

గడిచిన రెండు నెలలతో పోల్చితే ఈ 4 రోజుల్లో నమోదవుతున్న కేసుల సంఖ్య గ్రేటర్ లో కరోనా తీవ్రతను తెలుపుతోంది.  ఏప్రిల్ లో 376, మే నెలలో 876 కేసులు రాగా.. ఈ నెలలో నమోదైన 638తో కలిసి మొత్తం గ్రేటర్ లో కేసులు 2 వేలకు చేరువలో ఉన్నాయి.

 

ఇలా వచ్చినయ్​

రోజు           నమోదు

బుధవారం           108

గురువారం          110

శుక్రవారం           116

శనివారం        152

మరిన్ని వార్తల కోసం

నెట్టింట్లో వైరల్ అవుతున్న సన్న పిన్ చార్జర్

 

Latest Updates