గిరిజనులకు తీపి కబురు: అటవీ ఉత్పత్తుల ధరల పెంపు

భద్రాచలం, వెలుగు: కరవు కాలంలో గిరిజనులకు తీపికబురు. గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు ధరలు పెంచుతూ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‍ డా.క్రిష్టినా జెడ్‍ చోంగ్తు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. నేటి నుంచే ధరలను అమలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గిరిజనుల నుంచి గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కొనుగోలు చేసే ఈ ఉత్పత్తులకు కొత్త ధరలను ఇవ్వాలని ఆదేశించారు.

వివిధ ఉత్పత్తులకు గిరిజనులకు చెల్లిస్తున్న ధర కిలోకు రూ.లలో..
ఉత్పత్తి           – పాత ధర      – కొత్త ధర
తేనె                 -195             – 225
ఇప్ప పువ్వు     – 17               – 30
జిగురు           – 108               -114
ఇప్ప బద్ద         -25               – 29
ఉసిరి                -45               -52
నల్లజీడిగింజలు  -9              -12
కుంకుడుకాయలు  -8          -14

Latest Updates