పెరుగుతున్న స్మార్ట్‌‌ డివైజ్‌ల వాడకం

న్యూఢిల్లీ: సాధారణ ఎలక్ట్రానిక్స్‌‌‌‌ వస్తువులకు బదులు స్మార్ట్‌‌‌‌ డివైజ్‌‌‌‌లు కొనేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. స్మార్ట్‌‌‌‌ టీవీలు, వాచ్‌‌‌‌లు, స్పీకర్లు, బల్బులను యూత్‌‌‌‌ ఎక్కువగా కొంటున్నారు. సాధారణ ప్రజల్లోనూ వీటి వాడకం పెరుగుతోంది.  స్మార్ట్‌‌‌‌ డివైజ్‌‌‌‌లలో చాలా వరకు ఇంటర్నెట్‌‌‌‌తోనే పనిచేస్తాయి. మనదేశంలో చాలా తక్కువ రేట్లకే డేటా దొరుకుతుండటంతో స్మార్ట్‌‌‌‌డివైజ్‌‌‌‌ ఎకో సిస్టమ్‌‌‌‌ బలపడుతోందని టెక్‌‌‌‌ఆర్క్‌‌‌‌ చేసిన సర్వే వెల్లడించింది. ఈ స్టడీ వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుతం స్మార్ట్‌‌‌‌ఫోన్లు వాడుతున్న వారిలో 52 శాతం మంది స్మార్ట్‌‌‌‌డివైజ్‌‌‌‌లు లేదా ఓటీటీ సబ్‌‌‌‌స్క్రిప్షన్లు తీసుకోవాలని అనుకుంటున్నారు. స్మార్ట్‌‌‌‌ వాచ్‌‌‌‌లు, స్పీకర్లు కొంటామని 36 శాతం మంది చెప్పారు. స్మార్ట్‌‌‌‌ ఎయిర్‌‌‌‌ ప్యూరిఫయర్‌‌‌‌/స్మార్ట్‌‌‌‌బల్స్‌‌‌‌ వంటి డివైజ్‌‌‌‌లు కొనబోతున్నామని 31 శాతం మంది చెప్పారు. ‘‘ఇండియన్లు స్మార్ట్‌‌‌‌ డివైజ్‌‌‌‌లు కొనడం ఇప్పుడే మొదలవలేదు. ఎప్పటి నుంచో ట్యాబ్లెట్‌‌‌‌ పీసీలు, స్మార్ట్‌‌‌‌వాచ్‌‌‌‌లు, ఐపీ సర్వైలెన్స్‌‌‌‌ కెమెరాలను కొంటున్నారు. ఇప్పుడేమో స్మార్ట్‌‌‌‌టీవీలు, స్ట్రీమింగ్‌‌‌‌ డివైజ్‌‌‌‌లు, స్మార్ట్‌‌‌‌స్పీకర్లకు డిమాండ్​ పెరిగింది’’ అని టెక్‌‌‌‌ఆర్క్‌‌‌‌ ఫౌండర్‌‌‌‌, చీఫ్‌‌‌‌ ఎనలిస్ట్‌‌‌‌ ఫైజల్ కవూసా వివరించారు. గత మూడు నెలలుగా ట్రూ వైర్‌‌‌‌లెస్‌‌‌‌ స్టీరియో హెడ్‌‌‌‌ఫోన్స్‌‌‌‌, స్మార్ట్‌‌‌‌ సెట్‌‌‌‌ టాప్‌‌‌‌ బాక్సులు, స్ట్రీమింగ్‌‌‌‌ స్టిక్స్‌‌‌‌ బాగా అమ్ముడవుతున్నాయి. సాధారణ టీవీని స్మార్ట్‌‌‌‌టీవీగా మార్చడానికి ఇలాంటి సెట్‌‌‌‌టాప్‌‌‌‌ బాక్సులను, స్టిక్స్‌‌‌‌ను వాడుతారు.  స్మార్ట్‌‌‌‌ డివైజ్‌‌‌‌లను కొనేటప్పుడు కస్టమర్లు బ్రాండ్‌‌‌‌కు ఎక్కువ ఇంపార్టెన్స్‌‌‌‌ ఇస్తున్నారు. అన్నింటికంటే ప్రాసెసర్‌‌‌‌ ముఖ్యమని భావిస్తున్నారు. దీనిని బట్టే డివైజ్‌‌‌‌ పనితీరు ఉంటుంది కాబట్టే హైఎండ్‌‌‌‌ ప్రాసెసర్‌‌‌‌ ఉన్న డివైజ్‌‌‌‌లను కొంటామని సర్వేలో పాల్గొన్న  మెజారిటీ రెస్పాండెంట్లు చెప్పారు. స్మార్ట్‌‌‌‌ డివైజ్‌‌‌‌లలో ఎక్కువగా మీడియాటెక్‌‌‌‌ ప్రాసెసర్లను ఉపయోగిస్తున్నారు. స్మార్ట్‌‌‌‌టీవీలు, స్పీకర్లు, ఎస్టీబీలు, వైర్‌‌‌‌లెస్‌‌‌‌ హెడ్‌‌‌‌ఫోన్లలో ఈ కంపెనీ చిప్స్‌‌‌‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరో చిప్‌‌‌‌ మేకర్‌‌‌‌ క్వాల్‌‌‌‌కామ్‌‌‌‌ ఎస్‌‌‌‌ఓసీలు ఎక్కువ మొబైల్‌‌‌‌ ఫోన్లలో కనిపిస్తున్నాయి. కొన్ని స్మార్ట్‌‌‌‌వాచ్‌‌‌‌లలోనూ ఇవి ఉంటున్నాయి.

కంపెనీలన్నీ స్మార్ట్‌‌‌‌వైపే..

స్మార్ట్‌‌‌‌ డివైజ్‌‌‌‌లకు డిమాండ్‌‌‌‌ పెరగడంతో చాలా కంపెనీలు ఈ సెగ్మెంట్లోకి వచ్చాయి. దాదాపు అన్ని డీటీహెచ్‌‌‌‌ కంపెనీలు స్ట్రీమింగ్‌‌‌‌ స్టిక్‌‌‌‌లను, స్ట్రీమింగ్‌‌‌‌ ఎస్టీబీలను లాంచ్‌‌‌‌ చేశాయి. యాపిల్‌‌‌‌ సహా శామ్‌‌‌‌సంగ్‌‌‌‌, ఎంఐ, హువావే, అమేజ్‌‌‌‌ఫిట్‌‌‌‌, లెనెవో వంటివి స్మార్ట్‌‌‌‌వాచీల సెగ్మెంట్లోకి ప్రవేశించాయి. రూ.1,500ల నుంచి స్మార్ట్‌‌‌‌వాచీలు లభిస్తున్నాయి. ఏవో కొన్ని మినహాయిస్తే మిగతా చిన్న, పెద్ద కంపెలన్నీ స్మార్ట్‌‌‌‌టీవీలను తయారు చేస్తున్నాయి. 32 ఇంచుల స్మార్ట్‌‌‌‌టీవీల రేట్లు దాదాపు రూ.10 వేల నుంచి మొదలవుతున్నాయి. అండ్రాయిడ్‌‌‌‌ ఫోన్ల మాదిరే స్మార్ట్‌‌‌‌టీవీల కోసం గూగుల్‌‌‌‌ ప్రత్యేక ఆపరేటింగ్‌‌‌‌ సిస్టమ్‌‌‌‌ తయారు చేసింది. స్మార్ట్‌‌‌‌ వేరబుల్స్‌‌‌‌ కోసం వేర్‌‌‌‌ ఓఎస్‌‌‌‌ను రూపొందించింది. యాపిల్‌‌‌‌ కూడా స్మార్ట్‌‌‌‌వాచీల కోసం ప్రత్యేక సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ తయారు చేసింది. ఫిలిప్స్‌‌‌‌, సిస్కా, ఎంఐ వంటి కంపెనీలు స్మార్ట్‌‌‌‌బల్బులను తయారు చేస్తున్నాయి. వై–ఫై ద్వారా వీటిని కంట్రోల్‌‌‌‌ చేయొచ్చు. అమెజాన్‌‌‌‌, గూగుల్‌‌‌‌ వంటివి స్మార్ట్‌‌‌‌ స్పీకర్లను తయారు చేస్తున్నాయి. వీటి ద్వారా ఇంట్లోని స్మార్ట్‌‌‌‌ డివైజ్‌‌‌‌లను కంట్రోల్‌‌‌‌ చేయవచ్చు. స్మార్ట్‌‌‌‌స్పీకర్‌‌‌‌ వాయిస్‌‌‌‌ కమాండ్స్ ద్వారా పనిచేస్తుంది. ఉదాహరణకు స్మార్ట్‌‌‌‌బల్స్‌‌‌‌ను ఆన్‌‌‌‌ చేయడానికి వాయిస్‌‌‌‌ కమాండ్‌‌‌‌ ఇస్తే చాలు. సీసీ కెమెరాలను, స్మార్ట్‌‌‌‌టీవీలను, ఎయిర్‌‌‌‌ ప్యూరిఫయర్లను ఈ స్పీకర్ల ద్వారా ఆన్‌‌‌‌/ఆఫ్‌‌‌‌ చేయవచ్చు. కొన్ని కంపెనీలు వై–ఫైతో కంట్రోల్‌‌‌‌ చేసే ఏసీలను కూడా అమ్ముతున్నాయి.

కరోనా వచ్చినా గానీ మనదేశంలో స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్ల మార్కెట్‌‌‌‌‌‌‌‌ ఎంతమాత్రమూ తగ్గలేదు. డిమాండ్‌‌‌‌‌‌‌‌కు తగట్టు ఫోన్ల సప్లై లేదని సెల్లర్లే చెబుతున్నారు. చైనా తరువాత అతిపెద్ద స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌ ఇండియానే! అయితే మనోళ్లు స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్ల దగ్గరే ఆగిపోవడం లేదు. స్మార్ట్‌‌‌‌‌‌‌‌ వాచ్‌‌‌‌‌‌‌‌/స్పీకర్‌‌‌‌‌‌‌‌/బల్బుల వంటి వాటిని విపరీతంగా కొంటున్నారు.

For More News..

గొడవలొద్దు.. బార్డర్‌‌‌‌లో టెన్షన్స్ తగ్గించుకుందాం

రాష్ట్రాలు సెంటర్‌‌‌‌ గైడ్‌‌‌‌లైన్స్‌‌‌‌ పాటించాల్సిందే

మీరు మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నారా? అయితే ఇది మీకోసమే..

Latest Updates