జోరుమీదున్న ఇండియా..రోహిత్ హాఫ్ సెంచరీ

ind-pak-rohith-50-get-india-off-to-brisk-start

మాంచెస్టర్‌‌: పాక్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇండియా జోరుమీదుంది. టాస్ ఓడి బ్యాటింగ్ చేస్తున్న భారత్ కు మంచి ప్రారంభం దక్కింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, KL రాహుల్ ఆచితూచి ఆడుతున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ హాఫ్ సెంచరీ చేశాడు. 2 సిక్సులు, 6 ఫోర్లతో 35 బాల్స్ లో హాఫ్ సెంచరీ హిట్ మ్యాన్.

రన్ ఔట్ మిస్..

10వ ఓవర్‌లో రోహిత్ రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. రియాజ్ వేసిన ఫస్ట్ బాల్ ని రాహుల్ మిడ్‌ వికెట్ దిశగా షాట్ ఆడాడు. ఐతే ఫస్ట్ రన్ పూర్తి చేసిన తర్వాత రోహిత్ రెండో రన్ తీసేందుకు సగం పిచ్ వరకు వెళ్లాడు. బౌలింగ్ ఎండ్‌లో ఉన్న రాహుల్ పరుగు తీసేందుకు నిరాకరించడంతో రోహిత్ వెనక్కి వెళ్లాడు. బాల్ ని అందుకున్న ఫకార్ జమాన్ బౌలింగ్ ఎండ్‌వైపు త్రో వేశాడు.  దీంతో రోహిత్ కు లైఫ్ రావడంతో పాక్ బౌలర్లపై విరుచుకుపడి ఆడుతున్నాడు రోహిత్.

17 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా భారత్ 99 రన్స్ చేసింది. రోహిత్(60), రాహుల్(36) రన్స్ తో క్రీజులో ఉన్నారు.

Latest Updates