World Cup 2023 Final: ఫైనల్ మ్యాచ్ రోజు బార్లు, వైన్ షాపులు బంద్.. క్రికెట్ ప్రేమికుల ఆగ్రహం

World Cup 2023 Final: ఫైనల్ మ్యాచ్ రోజు బార్లు, వైన్ షాపులు బంద్.. క్రికెట్ ప్రేమికుల ఆగ్రహం

ఆదివారం అంటేనే మందుబాబుల అలసట తీరే రోజు. వారమంతా ఎన్ని పెగ్గులేసినా.. ఆరోజు మాత్రం మరో నాలుగు ఎక్కువేయాల్సిందే. అందునా రేపు(నవంబర్ 19) వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో ఎన్ని సిట్టింగ్ ప్లాన్స్ వేసుంటారు చెప్పండి. ఇలాంటి సమయంలో బార్లు, వైన్ షాపులు బంద్ అంటే ఊరుకుంటారా! ఊరుకోరు.. అలా అని ఏమి చేయలేరు. అందుకే ఇవాళే కొనేసుకొని ఇళ్లలోనే దుకాణం పెట్టుకుంటున్నారు.

నవంబర్ 19న ఛత్ పూజ కావడంతో ల్లీ ప్రభుత్వం ఆరోజుని డ్రై డేగా ప్రకటిస్తూ సర్క్యులర్‌ను విడుదల చేసింది. దీంతో రాజధాని ప్రాంతంలో ఉన్న బార్లు, వైన్ షాపులు బంద్ అట. ఈ ప్రకటన రాజధాని ప్రాంతంలో ఉన్న యువతకు ఆగ్రహం తెప్పిస్తోంది. కేజ్రీవాల్ ప్రభుత్వంపై వీరు కన్నెర్ర చేస్తున్నారు. ఇది మంచి నిర్ణయం కొందరు అని సమర్దిస్తుంటే, ఫినాలే కోసం లైవ్ స్క్రీనింగ్‌లు ఏర్పాట్లు చేసిన వారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 19న డ్రై డేగా ప్రకటించడాన్ని నిరసిస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. వీటిపై ఓ లుక్కేయండి.