టీమిండియా మాతో జాగ్రత్త!.. మమ్మల్ని ఓడించగలరా?

బ్రిస్బేన్‌‌లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్ట్‌లో విక్టరీ సాధించిన టీమిండియాపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంగ్లండ్ మాజీ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ కూడా భారత కుర్రాళ్ల ఆటకు ఫిదా అయ్యానని చెప్పాడు. అయితే వచ్చే నెలలో జరగబోయే ఇంగ్లండ్ సిరీస్‌‌లో అసలైన సవాల్‌కు టీమిండియా రెడీగా ఉండాలన్నాడు. ఆసీస్ పై గెలుపు తర్వాత ఎక్కువ సంబురాలు చేసుకోవద్దని, ఇంగ్లండ్ టీమ్‌‌తో జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. ‘చారిత్రాత్మక గెలుపు సాధించిన భారత్ సెలబ్రేట్ చేసుకోవాలి. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ విక్టరీని కొట్టారు. కానీ అసలైన్ జట్టు ఇంగ్లండ్ కొన్ని వారాల్లో భారత్‌‌కు రాబోతోంది. ఈ టీమ్‌‌ను మీరు మీ సొంత గడ్డపై ఓడించాలి. జాగ్రత్తగా ఉండండి.. రెండు వారాలే ఉన్నాయి. ఎక్కువగా సంబురాలు చేసుకోకండి’ అని పీటర్సన్ ట్వీట్ చేశాడు.

Latest Updates