చెల్లుకు చెల్లు: టీమిండియాకు కివీస్ వైట్‌వాష్

మౌంట్ మాంగనీ: భారత్ తో 3 వన్డేల సిరీస్ ను  వైట్ వాష్ చేసింది న్యూజిలాండ్. మంగళవారం జరిగిన మూడో వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ను గెలిచింది కివీస్. సొంతగడ్డపై భారత్ తో 5 టీ20ల సిరీస్ ను ఓడిన కివీస్..వన్డే సిరీస్ ను గెలిచి పరువు నిలబెట్టుకుంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ మరోసారి విఫలమైంది.

న్యూజిలాండ్ కు భారీ టార్గెట్ ఇవ్వలేక పోయింది. 7 వికెట్ల నష్టానికి 296 రన్స్ చేసింది కోహ్లీ సేన. అనంతరం లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన కివీస్ వైట్ వాష్ దిశగా ఆడుతూ వచ్చింది. ప్రారంభం నుంచే ఆచితూచి ఆడుతూ టార్గెట్ ను ఫినిష్ చేసింది. 47.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి  300 రన్స్ చేసి గెలిచింది. దీంతో టీ20 సిరీస్ ప్రతీకారాన్ని ఈ విధంగా చెల్లుకు చెల్లు చేసింది కివీస్.   

see also: బీచ్ లో యువకుడు గల్లంతు

టెన్త్​ నుంచే ఆన్​జాబ్​ ట్రైనింగ్​

కాగ్నిజెంట్‌ లో 20వేల మందికి జాబ్స్

Latest Updates