మొహాలీ టీ20 : భారత్ టార్గెట్ : 150

మొహాలీ : టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో సౌతాప్రికా ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 రన్స్ చేసింది. సఫారీలకు మంచి ప్రారంభం దక్కింది. ఓపెనర్ ఢీకాక్ (52) హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా ప్లేయర్లు తక్కువ స్కోర్ కే పరిమిత మయ్యారు. మిల్లర్ (15) నిరాశ పరిచాడు. ఆ తర్వాత రెండో వికెట్ గా వచ్చిన బావుమా (49) ఫర్వాలేదనిపించడంతో సౌతాఫ్రికాకు ఆ మాత్రం స్కోర్ దక్కింది.

సౌతాఫ్రికా ప్లేయర్లలో..ఢీకాక్(52), బావుమా(49), డేవిడ్ మిల్లర్(15), ప్రిటోరియస్(10), ఫెలుక్వాయో(8) హెన్డ్రిక్స్(6), దుస్సెన్(1) రన్స్ చేశారు.

భారత బౌలర్లలో..  దీపక్ చాహర్(2), నవ్ దీప్ సౌనీ (1), పాండ్యా(1), రవీంద్ర జడేజా(1)లకు వికెట్లు దక్కాయి.