యువతిని వెంబడించిన పోకిరీలపై కేసు

 

హైదరాబాద్‌ : తనపై అసభ్యకరంగా ప్రవర్తించారని ఐదుగురిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. ఈ సంఘటన సోమవారం రాత్రి బంజారాహిల్స్ లో జరిగింది. సోమవారం రాత్రి ఓ మహిళా బంజారాహిల్స్ రోడ్ నెం-2పై నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు పోకిరీలు ఆమెపట్ల దురుసుగా ప్రవర్తించారు. కారులో వచ్చిన వారు ఆమెను వెంబడించి స్లోగా కారుతో ఢీకొట్టారు. దోంతొ సీరియస్ అయిన ఆ యువతి తనను ఎందుకు ఢీకొట్టారని వారిని ప్రశ్నించింది. ఆ పోకిరీలు మరింత రెచ్చిపోయి యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి దుర్భాషలాడారు.

తనను కారుతో ఢీకొట్టిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మంగళవారం ఉదయం బాధితురాలు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కారులో ముగ్గురు మహిళలు, ఇద్దరు యువకులు ఉన్నట్లు చెప్పింది. బాధితురాలు సినిమాల్లో ఆర్ట్‌ డైరెక్టర్‌గా పని చేస్తుంది.

Latest Updates