స్వేచ్ఛ వచ్చిన రోజు : విమోచనమా… విలీనమా…?

సెప్టెంబర్​ 17వ తేదీపై తెలంగాణలో దాదాపు 70 ఏళ్లుగా వివాదం నలుగుతోంది . నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిన రోజు కాబట్టి ‘విమోచన దినోత్సవం’ జరపాలంటారు కొందరు. హైదరాబాద్​ సంస్థానాన్ని ఇండియన్​ యూనియన్​లో కలిపేసిన రోజు కాబట్టి ‘విలీన దినోత్సవం’ జరపాలంటారు మరికొందరు. దేశానికి 1947 ఆగస్టు 15న ఇండిపెండెన్స్​ లభించగా, హైదరాబాద్​ సంస్థానానికి ఏడాది తర్వాత విముక్తి లభించిందన్న చారిత్రక వాస్తవంపై ఎలాంటి గొడవా లేదు.

ఈ విముక్తి పోరాటంలో పాల్గొన్న ప్రజలు, కవులు, కళాకారులు, జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, ప్రజా సంఘాల కార్యకర్తలను స్మరించుకోవడం తప్పనిసరి. ఏదైనా కానీ తెలంగాణ గడ్డకు స్వేచ్ఛ వచ్చిన రోజు ఇది.

 

Latest Updates