ఇండియా-ఎ టీమ్‌లో సిరాజ్‌, విహారి

హైదరాబాద్ : ఐపీఎల్‌‌‌‌–12వ సీజన్‌‌‌‌లో ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయిన హైదరాబాద్‌‌‌‌ పేసర్‌‌‌‌ మహ్మద్‌‌‌‌ సిరాజ్‌‌‌‌, తెలుగు ఆటగాడు  హనుమ విహారి వెస్టిండీస్‌‌‌‌ పర్యటనకు వెళ్లే  ఇండియా–ఎ టీమ్‌‌‌‌కు ఎంపికయ్యారు.  జూలై 11 నుంచి ఆగస్టు 19 వరకు జరిగే ఈ టూర్‌‌‌‌లో  వెస్టిండీస్‌‌‌‌-–ఎతో ఐదు వన్డేలు, మూడు నాలుగు రోజుల మ్యాచ్‌‌‌‌ల్లో ఇండియా–ఎ తలపడుతుంది. ఈ టూర్‌‌‌‌లో హనుమ విహారి వన్డేతో పాటు, నాలుగు రోజుల మ్యాచ్‌‌‌‌ ఆడే జట్టుకు ఎంపికవ్వగా, పేసర్‌‌‌‌ సిరాజ్‌‌‌‌ నాలుగు రోజులు మ్యాచ్‌‌‌‌ ఆడే జట్టుకు మాత్రమే సెలెక్ట్‌‌‌‌ అయ్యాడు. ఇండియా–-ఎ వన్డే జట్టుకు మనీశ్‌‌‌‌ పాండే కెప్టెన్‌‌‌‌గా ఎంపికవ్వగా, నాలుగు రోజుల మ్యాచ్‌‌‌‌ల టీమ్‌‌‌‌ను శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ నడిపించనున్నాడు.

ఈ టూర్‌‌‌‌తో పాటు ఈ నెలలో ఇండియాకు వస్తున్న  శ్రీలంక–ఎ జట్టుతో ఆడే సిరీస్‌‌‌‌లో పాల్గొనే ఇండియా–ఎ జట్లను ఆలిండియా సీనియర్‌‌‌‌ సెలెక్షన్‌‌‌‌ కమిటీ మంగళవారం ప్రకటించింది. ఈ నెల 25 నుంచి జూన్‌‌‌‌ 15వ తేదీ వరకు సాగే ఈ టూర్‌‌‌‌లో ఇండియా–ఎతో  శ్రీలంక నాలుగు రోజుల మ్యాచ్‌‌‌‌లు రెండు, ఐదు వన్డేల సిరీస్‌‌‌‌ ఆడుతుంది. ఐపీఎల్‌‌‌‌లో మెరిసిన చాలా మంది యువ ఆటగాళ్లు ఈ రెండు సిరీస్‌‌‌‌లకు చాన్స్‌‌‌‌ కొట్టేశారు. శ్రీలంక–ఎ తో జరిగే వన్డేల్లో ఆడే ఇండియా–ఎకు ప్రియాంక్‌‌‌‌ పంచల్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా ఎంపికవ్వగా, నాలుగు రోజుల మ్యాచ్‌‌‌‌ ఆడే జట్టుకు ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా ఎంపికయ్యాడు.

వెస్టిండీస్‌‌‌‌ టూర్‌‌‌‌కు ఇండియా–ఎ వన్డే జట్టు:

మనీశ్‌‌‌‌పాండే (కెప్టెన్‌‌‌‌), పృథ్వీ షా, మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌, శుభ్‌‌‌‌మన్‌‌‌‌గిల్‌‌‌‌, శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌, హనుమ విహారి, రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌ (కీపర్), రాహుల్‌‌‌‌ చహర్‌‌‌‌, వాషింగ్టన్‌‌‌‌ సుందర్‌‌‌‌, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌, క్రునాల్‌‌‌‌ పాండ్యా, దీపక్‌‌‌‌ చహర్‌‌‌‌, నవదీప్‌‌‌‌ సైనీ, ఖలీల్‌‌‌‌ అహ్మద్‌‌‌‌, అవిష్‌‌‌‌ ఖాన్‌‌‌‌.

నాలుగు రోజుల మ్యాచ్‌‌‌‌లకు జట్టు (తొలి రెండు మ్యాచ్‌‌‌‌లకు): శ్రేయస్‌‌‌‌ అయ్యర్(కెప్టెన్‌‌‌‌), ప్రియాంక్‌‌‌‌ పంచల్‌‌‌‌,  ఈశ్వరన్‌‌‌‌, శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌, హనుమ విహారి, శివమ్‌‌‌‌ దూబె, వృద్ధిమాన్‌‌‌‌ సాహా(కీపర్‌‌‌‌), కేఎస్‌‌‌‌ భరత్‌‌‌‌(కీపర్‌‌‌‌), కృష్ణప్ప గౌతమ్‌‌‌‌, షాబాజ్‌‌‌‌ నదీమ్‌‌‌‌, మయాంక్‌‌‌‌ మార్కండే, నవదీప్‌‌‌‌ సైనీ, మహ్మద్‌‌‌‌ సిరాజ్‌‌‌‌, శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌, అవేష్‌‌‌‌ ఖాన్‌‌‌‌.

మూడో మ్యాచ్‌‌‌‌కు జట్టు: శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌(కెప్టెన్), పృథ్వీ షా, మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌, హనుమ విహారి, శుభ్‌‌‌‌మన్‌‌‌‌గిల్‌‌‌‌, వృద్ధిమాన్‌‌‌‌ సాహా(కీపర్‌‌‌‌), కేఎస్‌‌‌‌ భరత్(కీపర్‌‌‌‌), శివమ్‌‌‌‌ దూబె, మయాంక్‌‌‌‌ మార్కండే, కృష్ణప్ప గౌతమ్‌‌‌‌, షాబాజ్‌‌‌‌ నదీమ్‌‌‌‌, నవదీప్‌‌‌‌ సైనీ, మహ్మద్‌‌‌‌ సిరాజ్‌‌‌‌, శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌, అవేష్‌‌‌‌ ఖాన్‌‌‌‌.