
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ చేతులెత్తేసింది. మూడోరోజు 96/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆట ప్రారంభించిన భారత ఆటగాళ్లు.. మరో 148 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు. పూజారా 176 బంతుల్లో హఫ్ సెంచరీ చేసి భారత స్కోర్‌ను రెండొందలు దాటించాడు. భారత్ 100.4 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయింది. దాంతో ఆసీస్‌కు 94 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్లు కమిన్స్ 4 వికెట్లు, హాజల్‌వుడ్ 2 వికెట్లు, స్టార్క్ 1 వికెట్ తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 105.4 ఓవర్లలో 338 పరుగులకు ఆలౌట్ అయింది.
For More News..