ఇండియా, అమెరికా టాప్ సీఈవోల భేటీ

అగ్రికల్చర్, డిజిటల్ పేమెంట్లు, సర్వీస్‌‌లపై చర్చలు
ఇరు దేశాలు కోలాబరేట్ అవ్వడంపై సంప్రదింపులు

న్యూఢిల్లీ: అగ్రికల్చర్‌‌‌‌కు సంబంధించిన విషయాలు, డిజిటల్ పేమెంట్లు, సర్వీసుల విషయంలో కోలాబరేట్ అవ్వడంపై ఇండియా, అమెరికాలలోని టాప్ బిజినెస్ లీడర్లు సమావేశమయ్యారు. ఇండియా–యూఎస్ సీఈవో ఫోరమ్‌‌లో ఈ విషయాలపై చర్చించారు. వాటర్ మేనేజ్‌‌మెంట్, ఫామ్ ఎక్విప్‌‌మెంట్ విషయాలపై కూడా సీఈవోలు సంప్రదింపులు జరిపారు. డిజిటల్ ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్‌‌ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ(ఐసీటీ), హెల్త్‌‌కేర్, ఫార్మాస్యూటికల్స్, ఎయిరోస్పేస్, డిఫెన్స్, ఎంట్రప్రెన్యూర్‌‌‌‌షిప్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్వెస్ట్‌‌మెంట్ వంటి చాలా విషయాలు ఈ వర్చ్యువల్ మీటింగ్‌‌లో చర్చించారు. ఈ మీటింగ్‌‌లో 24 మంది సీఈవోలు పాల్గొన్నారు. టాటా సన్స్, భారతీ ఎంటర్‌‌‌‌ప్రైజస్, టీసీఎస్, భారత్ ఫోర్జ్, లాక్‌‌హీడ్ మార్టిన్, క్వాల్‌‌కామ్, మాస్టర్ కార్డ్, హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టమ్స్ నుంచి టాప్ ఎగ్జిక్యూటివ్‌‌లు ఈ మీటింగ్‌‌లో పాలుపంచుకున్నారు. టాటా సన్స్ ఛైర్మన్ ఎన్‌‌ చంద్రశేఖరన్, లాక్‌‌హీడ్ మార్జిన్ సీఈవో జిమ్ ఈ ఫోరమ్‌‌కు కోఛైర్‌‌‌‌గా వ్యవహరించారు. ఇండియా వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, అమెరికా కామర్స్ సెక్రటరీ విల్బర్ రోజ్‌‌లు ఛైర్‌‌‌‌గా ఉన్నారు. ఇండియాకు అమెరికా వరుసగా రెండో ఏడాది కూడా టాప్ ట్రేడింగ్‌‌ పార్టనర్‌‌‌‌గా ఉంది. 2019లో 87.96 బిలియన్ డాలర్ల ట్రేడ్ జరగగా.. 2019–20లో 88.75 బిలియన్ డాలర్ల ట్రేడింగ్ అయింది. ఇరు దేశాలకు ఈ మీటింగ్ చాలా కీలకంగా మారింది. డిజిటల్ ట్యాక్స్ ఇష్యూలను కూడా అమెరికా ట్రేడ్ ప్రతినిధులు ఇండియాతో చర్చించారు. హెచ్‌‌–1బీ వీసాలను సస్పెండ్ చేయడంపై కూడా ఈ మీటింగ్‌‌లో ప్రస్తావనకు వచ్చింది. అమెరికా ఎజెండాలో డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ అత్యంత ముఖ్యమైనదిగా ఉంది. ఇండియాతో పాటు, తొమ్మిది దేశాలు విధించే డిజిటల్ ట్యాక్స్‌‌లపై వాషింగ్టన్ విచారణ జరపాలని ప్లాన్ చేస్తోంది. ఇండియా కూడా అమెరికా విధిస్తోన్న హై డ్యూటీల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతోంది. స్టీల్, అల్యూమినియం ప్రొడక్ట్‌‌లపై అమెరికా ఎక్కువ సుంకాలను వేస్తోంది. అగ్రికల్చర్‌‌‌‌కు సంబంధించిన ప్రొడక్ట్‌‌లు, మెడికల్ డివైజ్‌‌లు, ఐసీటీ ప్రొడక్ట్‌‌ల విషయంలో మార్కెట్ యాక్సస్ కల్పించాలని అమెరికా కోరుతోంది.

For More News..

రూ. కోటిన్నర బిల్లు మాఫీ చేసి.. విమాన టిక్కెట్లు కొనిచ్చి మరీ..

కరోనా క్రైసిస్‌‌‌‌తో.. ఉద్యోగాల తీరు మారింది

సర్కారీ పోర్టల్ హ్యాక్ చేసిన అన్నదమ్ములు

Latest Updates