నేడు భారత్-బంగ్లా ఢీ : 1000వ టీ20లో గెలిచేదెవరో..?

ఢిల్లీ : వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ కు సన్నాహకంగా భాగంగా సొంతగడ్డపై బంగ్లాదేశ్ తో టీ20కి సిద్ధమైంది భారత్. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఇవాళ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది. ఈ సిరీస్ నుంచి కెప్టెన్ విరాట్ కోహ్లీ విశ్రాంతి తీసుకుంటుండగా..ఓపెనర్ రోహిత్ శర్మ కెప్టెన్సీ బాధ్యతలు వహిస్తున్నాడు. మరోవైపు ఆల్ రౌండర్ షకీబుల్ అల్ హసన్ జట్టుకు దూరమవడం బంగ్లాకు ఇబ్బందికరంగా మారింది. పిచ్ స్వతహాగా స్పిన్నర్లకు అనుకూలమైనప్పటికీ…మంచు ప్రభావం చూపనుంది.

ఈ మ్యాచ్ కు ఓ ప్రత్యేకత ఉంది

ఇంటర్నేషనల్ టీ20ల్లో ఇది 1000వ మ్యాచ్ కావడం విశేషం. దీంతో ఈ టీ20 చారిత్రాత్మక మ్యాచ్ గా నిలువనుంది. ఇప్పటివరకు భారత్ –బంగ్లా 8టీ20ల్లో తలపడ్డాయి. ఇందులో అన్నింట్లో(8-0) టీమిండియానే విక్టరీ సాధించింది. నేడు జరిగే 9వ టీ20లో కూడా గెలిచి, 1000వ మ్యాచ్ రికార్డును భారత్ సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఆల్ ది బెస్ట్ టీమిండియా.

టీమ్స్ (అంచనా)
భారత్: రోహిత్ (కెప్టెన్), ధావన్, కేఎల్ రాహుల్/శాంసన్, శ్రేయాస్, పంత్, శివమ్ దూబే, కృనాల్, సుందర్, చాహల్, దీపక్ చాహర్, ఖలీల్/శార్దూల్.
బంగ్లాదేశ్: మహ్ముదుల్లా (కెప్టెన్), లిటన్, సౌమ్య, మిథున్/నయీమ్, ముష్ఫికర్, మొసద్దిక్, అఫిఫ్, అరాఫత్, ముస్తఫిజుర్, అమీన్, తైజుల్.

Latest Updates