వరల్డ్ కప్ గెలిచి పరువు పోగొట్టుకున్న బంగ్లాదేశ్

అండర్ 19వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు అతి చేశారు. దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ పై బంగ్లాదేశ్ విజయం సాధించింది. అయితే తొలిసారి కప్ గెలిచిన జట్టు ఓడిన ప్రత్యర్ధి జట్టుకు మ్యాచ్ అనంతరం అభివాదం తెలుపుతాయి. కానీ బంగ్లా ఆటగాళ్లు హుందాతనం మరిచి పోయి గ్రౌండ్ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేశారు. జెంటిల్ మ్యాన్ గేమ్ లో హుందాతనాన్ని మరిచి బంగ్లాదేశ్ ఆటగాళ్లు టీమిండియా ఆటగాళ్లను గేలి చేస్తు, అసభ్యకరంగా ప్రవర్తించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ్యాచ్ గెలిచిన అనంతరం బంగ్లాఆటగాళ్లు భారత్ ఆటగాళ్లపై గొడవకు దిగారు.  పేసర్‌ షోరిఫుల్‌ ఇస్లాం నోటికి పనిచెప్పాడు. మరో ఆటగాడు భారత్ ఆటగాళ్లను పక్కకి తోసేశాడు. బంగ్లా- భారత్ ఆటగాళ్ల గొడవపై  అంపైర్‌ జోక్యం చేసుకొని ఇరు జట్ల మధ్య గొడవను సద్దు మణిగేలా చేశారు.

Latest Updates