ఫింగర్​ ఏరియాల్లో సై అంటే సై

ఫింగర్​ ఏరియాల్లో బలగాలు పెంచిన చైనా

డ్రాగన్​కు దీటుగా మన బలగాల మోహరింపు

ఎయిర్​ఫోర్స్​ కూడా తయార్​.. సుఖోయ్​, మిగ్​లతో రెక్కీలు

న్యూఢిల్లీ: కవ్వింపులను చైనా మరింత పెంచింది. బార్డర్​ దాటుతూ, కాల్పులకు తెగబడుతూ ఆ నిందను మన మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్న డ్రాగన్​ కంట్రీ.. వివాద ప్రాంతాల వద్ద బలగాల మోహరింపును పెంచుతోంది. చైనాకు అంతే దీటుగా మన ఆర్మీ కూడా సిద్ధమవుతోంది. బలగాలను పెంచుతోంది. రెండు దేశాల బలగాలు అతి కొద్ది దూరంలోనే ఉన్నాయి. సోమవారం నాటి ఘటన తర్వాత ఈస్టర్న్​ లడఖ్​లోని పాంగోంగ్​ సో లేక్​ ఉత్తర తీరంలో చైనా మోహరింపులను పెంచింది. మంగళవారం సాయంత్రం నుంచి అక్కడి ఫింగర్​ ఏరియాల్లో చైనా పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ (పీఎల్​ఏ) యాక్టివిటీ పెరిగింది. ఇప్పటికే అక్కడ చైనా డిఫెన్స్​ సెటప్​లను ఏర్పాటు చేసిందని ఆర్మీ అధికారి ఒకరు చెప్పారు. మన బలగాలు పీఎల్​ఏ యాక్టివిటీపై ఓ కన్నేసి ఉంచాయని, రెండు దేశాల సైనికులు కొద్ది దూరంలో మాత్రమే ఉన్నారని అన్నారు. అయితే, ఫింగర్​3, ఫింగర్​4 రిడ్జ్​లైన్స్​ వద్ద చైనా ఆర్మీ ఉన్నా.. వాళ్లపై అణువణువునా నిఘా పెట్టేందుకు ఫింగర్​ టాప్​లను మన బలగాలు అధీనంలోకి తెచ్చుకున్నాయని చెబుతున్నారు.

పట్టు మన చేతుల్లోనే

మన విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్​, చైనా మంత్రి వాంగ్​ యీ సమావేశం కాబోతున్న టైంలో.. చర్చల ద్వారా టెన్షన్​ను తగ్గించేందుకు అవకాశం దొరికింది. చర్చల్లో మనదే పై చేయి కానుంది. అందుకు తగ్గట్టు పాంగోంగ్​సో లేక్​ దక్షిణ తీరం ఇప్పుడు మన పట్టులోనే ఉంది. పాంగోంగ్​ లేక్​ ఉత్తర తీరం ఫింగర్లుగా ఉంటుంది.అందులో ఫింగర్​8 మనదే. అక్కడి నుంచి ఫింగర్​ 4 వరకు మన ఆర్మీ అధీనంలో ఉంది. కానీ, అక్కడే స్టేటస్​కోను మార్చేసే ప్రయత్నం చేస్తున్నది చైనా ఆర్మీ. ఫింగర్​4 వద్ద ఇప్పటికే బలగాలను మోహరించిన పీఎల్​ఏ.. ఫింగర్​5, ఫింగర్​8 మధ్యలోనూ నిర్మాణాలు చేపట్టింది. అక్కడి నుంచి దక్షిణ తీరాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవాలనుకున్న చైనా కుతంత్రాన్ని మన ఆర్మీ సాగనివ్వలే. ముందే అక్కడి కొండలను స్వాధీనం చేసుకుని షాకిచ్చింది. అందులో అత్యంత ముఖ్యమైన కొండ ప్రాంతం రెచిన్​ లా. మన ఆర్మీ చేతుల్లోనే ఇప్పుడు ఆ ప్రాంతం ఉంది.

మన ఎయిర్​ఫోర్స్​ తయార్​

పాంగోంగ్​ సో లేక్​ వద్ద ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు మన ఎయిర్​ఫోర్స్​ కూడా సిద్ధమైంది. అక్కడి ఉత్తర తీరం వద్ద సార్టీస్​ (రెక్కీ)ని పెంచింది. సుఖోయ్​, మిగ్​, ట్రాన్స్​పోర్ట్​ ఎయిర్​క్రాఫ్ట్​లతో నిఘాను మరింత పటిష్టం చేసిందని అధికారులు చెబుతున్నారు. అన్ని బార్డర్ల వద్ద బలగాలను ఆర్మీ మరింత అలర్ట్​ చేసిందని చెబుతున్నారు.

For More News..

కరెంట్ బండితో వంద కి.మీకి ఖర్చు పది రూపాయలే..

టీ20లలోకి రీ ఎంట్రీ ఇస్తానంటున్న యువరాజ్!

వీడియో: రోహిత్ శర్మ సిక్స్ కొడితే.. స్టేడియం ముందు వెళ్తున్న బస్‌పై పడింది

Latest Updates