బహామాస్​కు ఇండియా సాయం

  • ఒక మిలియన్​ డాలర్ల రిలీఫ్​ ప్యాకేజీ: కేంద్రం

న్యూఢిల్లీ/ఒట్టావా: డోరియన్​ హరికేన్​ ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న ద్వీపదేశం బహామాస్​ను ఆదుకునేందుకు ఇండియా ముందుకొచ్చింది. తక్షణ రిలీఫ్​ కింద ఆ దేశానికి ఒక మిలియన్​ డాలర్లు అందించనున్నట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్​ కుమార్​ చెప్పారు. బహామాస్​లో డోరియన్​ సృష్టించిన విలయంలో 40 మంది ప్రాణాలు కోల్పోగా, లక్షమందికిపైగా ఇండ్లు కోల్పోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో బహామాస్​​ ప్రజలకు ఇండియా అండగా ఉంటుందని రవీశ్​ చెప్పారు. అమెరికాలోని సౌత్​, నార్త్​ కరోలీనా రాష్ట్రాలనూ అతలాకుతలం చేసిన డోరియన్​ హరికేన్.. శనివారం రాత్రి కెనడాలోని హలిఫాక్స్ వద్ద తీరాన్ని దాటింది. హరికేన్​ తీరాన్ని దాటిన సమయంలో 155 కిలో మీటర్ల వేగంతో పెనుగాలలు వీచాయని, సముద్రపు అలలు 20 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయని  కెనడియన్​ వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

 

 

Latest Updates