కోహ్లీ గ్యాంగ్ సూపర్ విక్టరీ: ఆస్ట్రేలియా పై భారత్ విజయం

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ గ్యాంగ్ సూపర్ విక్టరీ కొట్టింది. మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా 2-1 తేడాతో గెల్చుకుంది. ఆస్ట్రేలియా విసిరిన 287 పరుగుల లక్ష్యాన్ని ఇండియా మరో 2 ఓవర్లు ఉండగానే ఛేదించింది. ఆస్ట్రేలియాపై 7 వికెట్ల తేడాతో జయబేరి మోగించింది. సెంచరీ హీరో, ఓపెనర్ రోహిత్ శర్మ 119 రన్స్ , కెప్టెన్ విరాట్ కోహ్లీ 89 రన్స్ చేసి ఇండియా విక్టరీలో కీ రోల్ పోషించారు. శ్రేయస్ అయ్యర్ 35 బాల్స్ లో 44 రన్స్ చేసి మ్యాచ్ ను ఈజీ చేశాడు.

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఇవాళ జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 286 రన్స్ చేసింది. స్టీవెన్ స్మిత్ 131 రన్స్ తో  ఆ జట్టు స్కోరుకు బ్యాక్ బోన్ లా నిలిచాడు.

Latest Updates