రెండో టీ20లో ఇండియా గ్రాండ్ విక్టరీ

న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టీ20 లో  భారత్  గ్రాండ్ విక్టరీ సాధించింది. 133 పరుగుల టార్గెట్ ను భారత్ 17.3 ఓవర్లలో  మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. లోకేష్ రాహుల్ 50 బంతుల్లో 57 రన్స్( నాటౌట్), శ్రేయస్ అయ్యర్ 44 పరుగులతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.

133 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఓపెనర్  రోహిత్ శర్మ 8 పరుగులకు, కెప్టెన్ కోహ్లీ 11 పరుగులకే  ఔట్ అయ్యారు. దీంతో మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ శ్రేయస్ అయ్యార్ తో నిలకడగా ఆడుతూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. శ్రేయస్ అయ్యార్ 33 బంతుల్లో 44 పరుగులతో రాణించాడు. శివమ్ ధూబె తో కలిసి రాహుల్ మరో  2 ఓవర్ల 3 బంతులుండగానే  టార్గెట్ ను చేధించారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. రెండో టీ20 విజయంతో ఐదు టీ20ల సిరీస్ లో భారత్ 2-0 తో ముందంజలో ఉంది.

see more news రెండో టీ20..ఇండియా టార్గెట్ 133

Latest Updates