చైనాలో ప్రాణాంతక వైరస్.. భారత విమానాశ్రయాల్లో స్క్రీనింగ్

చైనాలో కొత్తగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. జ్వరం, వాంతులు, న్యుమోనియా లక్షణాలతో ప్రాణాలను మింగేస్తున్న ఈ కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. జనవరి 12 నాటికే 1732 మందికి సోకిన ఈ వైరస్.. నేటికి దీని బాధితులు వేలల్లో పెరిగారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. మంగళవారం నాటికి దీని వల్ల చైనాలో పలువురు మరణించినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

అంటువ్యాధిలా వ్యాపించే వైరస్

కరోనా వైరస్‌పై చైనా మరో సంచలన విషయాన్ని ప్రకటించింది. ఈ కొత్త వైరస్ ఒకరి నుంచి మరొకరికి అంటువ్యాధిలా సంక్రమిస్తుందని ఆ దేశ నేషనల్ హెల్త్ కమిషన్ తాజాగా నిర్ధారించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు అప్రమత్తమయ్యాయి. చైనా నుంచి భారత్‌కు వచ్చే ప్రతీ ప్రయాణికుడినీ స్క్రీనింగ్ చేశాకే ఎయిర్‌పోర్టు నుంచి బయటకు పంపుతున్నారు. ఢిల్లీ, కోల్‌కతా, ముంబై సహా అన్ని విమానాశ్రయాల్లో ప్రీ ఇమిగ్రేషన్ కౌంటర్లు ఏర్పాటు చేసి థర్మల్ స్క్రీనింగ్ చేయాలని పౌర విమానయాన శాఖ సూచించింది. దీనిపై కేంద్ర ఆరోగ్య శాఖ కూడా అవసరమైన చర్యలు చేపట్టింది.

చైనాలోని వుహాన్ సిటీలో మొదలైన ఈ వైరస్ ఇప్పటికే జపాన్, థాయ్‌లాండ్ దేశాలకు విస్తరించింది.  ఈ వైరస్‌ను నియంత్రించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థలోపాటు పలు దేశాల సాయం తీసుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా తెలిపింది.

More News:

రెండేళ్లలో ఎన్నికలు: పవన్ సంచలన వ్యాఖ్యలు

వ్యాపిస్తున్న వైరస్.. అంతుచిక్కని రోగం

Latest Updates