బైబ్యాక్ ప్లాన్తో ఇండియాబుల్స్ షేర్లు ర్యాలీ

న్యూఢిల్లీ :షేర్ల బైబ్యాక్‌‌ వార్తల నేపథ్యంలో బుధవారం ట్రేడింగ్‌‌లో ఇండియాబుల్స్‌‌ వెంచర్స్‌‌, ఇండియాబుల్స్‌‌ రియల్‌‌ ఎస్టేట్‌‌ షేర్లలో ర్యాలీ వచ్చింది. బీఎస్‌‌ఈలో ఇండియాబుల్స్‌‌ వెంచర్స్‌‌ షేర్‌‌ రూ. 109.85 వద్ద అప్పర్‌‌ సర్క్యూట్‌‌ని తాకింది. అంతకు ముందు ముగింపుతో పోలిస్తే ఈ షేర్‌‌ 9.21 శాతం లాభపడింది. ఎన్‌‌ఎస్‌‌ఈలోనూ 9.99 శాతం పెరిగి రూ. 110.10 కి చేరింది. ఇక ఇండియాబుల్స్‌‌ రియల్‌‌ ఎస్టేట్‌‌ షేర్‌‌ బీఎస్‌‌ఈలో 4.99 శాతం పెరిగి అప్పర్‌‌ సర్క్యూట్‌‌ రూ. 43.1 ని తాకింది. ఎన్‌‌ఎస్‌‌ఈలోనూ ఈ షేరు 5 శాతం పెరిగి రూ. 43.05 కి చేరింది. షేర్ల బైబ్యాక్‌‌ ప్రతిపాదనను పరిశీలించేందుకు బోర్డుల డైరెక్టర్లు శుక్రవారం సమావేశం కానున్నట్లు రెండు కంపెనీలు స్టాక్‌‌ ఎక్స్చేంజ్‌‌లకు మంగళవారం తెలిపాయి

Latest Updates