భారత్‌ మాపై అసత్య ప్రచారం చేస్తోంది: పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌

లాహోర్‌‌: ఇండియా తమ దేశంపై కావాలనే అసత్య ప్రచారం చేస్తోందని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఆరోపించారు. కాశ్మీర్‌‌లో గొడవలకు పాకిస్తాన్‌ కారణమని ప్రపంచానికి అబద్దాలు చెప్పాలని చూస్తోందని అన్నారు. “ భారత్‌ పాకిస్తాన్‌పైన తప్పుడు ప్రచారం చేస్తోందని నేను ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాను. వాళ్లు ప్రతిసారి మమ్మల్ని టార్గెట్‌ చేస్తున్నారు. నియంత్రణ రేఖ ద్వారా పాకిస్తాన్‌ చొరబడేందుకు ప్రయత్నిస్తోందని చెప్పడం తప్పుడు అజెండా” అని ఇమ్రాన్‌ ట్వీట్‌ చేశారు. కాశ్మీర్‌‌లో జరుగుతున్న గొడవలు లోకల్‌ వాళ్లు చేస్తున్నారని అన్నారు. ఇండియా చర్యలు సౌత్‌ ఏషియాలో శాంతిభద్రతలు దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు.

 

Latest Updates