ఫిబ్రవరిలో ఆక్స్ ఫర్డ్ కరోనావ్యాక్సిన్

ఆక్స్ ఫర్డ్, అస్ట్రాజెనికాలు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను ఇండియాలో తయారు చేసేందుకు డీల్ కుదుర్చుకున్న సీరమ్ ఇనిస్టిట్యూట్, ఫిబ్రవరి 2021లో దీన్ని అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. దీనికి సంబంధించి సీరమ్ ఇనిస్టిట్యూట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదర్ పూనావాలా కీలక ప్రకటన చేశారు. మొదటి దశలో హెల్త్ కేర్ వర్కర్లకు, వయో వృద్ధులకు వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. ఆ తర్వాత ఏప్రిల్ నాటికి సామాన్య ప్రజలకు టీకా అందుబాటులోకి వస్తుందన్నారు. భారత నియంత్రణా సంస్థల నుంచి అనుమతి లభిస్తే, జనవరిలోపే వ్యాక్సిన్ ను తీసుకుని వస్తామన్నారు. మరో వ్యాక్సిన్ థర్డ్ స్టేజ్ ట్రయల్స్ కోసం ICMR తో కలిసి నమోదు ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ఈ వ్యాక్సిన్ రెండు డోస్ ల ధర రూ. 1000 వరకూ ఉంటుందని అదర్ పూనావాలా తెలిపారు. ఇప్పటికే తాము 4 కోట్ల డోస్ లను సిద్ధం చేశామన్నారు.

Latest Updates