దేశంలో రికార్డ్.. ఒక్కరోజే 1290 కరోనా మరణాలు

గత కొన్నిరోజులుగా దేశంలో కరోనా ఉగ్రరూపం చూపిస్తుంది. ప్రతి రోజు 90 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 90,123 కేసులు నమోదవగా అత్యధికంగా 1290 మంది చనిపోయారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 50,20,360 కు చేరగా మరణాల సంఖ్య 82,066కు చేరింది. 39,42,361 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా 9,95,933 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 78.53 గా ఉండగా..మరణాలు రేటు 1.63 గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇక దేశంలో నిన్న ఒక్కరోజే 1116842 టెస్టులు చేశారు. దీంతో సెప్టెంబర్ 15 నాటికి కరోనా టెస్టుల సంఖ్య 59429115 కు చేరిందని ఐసీఎంఆర్ ప్రకటించింది.

 

Latest Updates