మయాంక్, రోహిత్ గర్జన.. ఇండియా తొలి ఇన్నింగ్స్ 502/7 డిక్లేర్

సౌతాఫ్రికా 39/3

విశాఖపట్నంలో సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ భారత్ భారీస్కోరు సాధించింది. మయాంక్ అగర్వాల్ , రోహిల్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ తో టీమిండియా టెస్టును కమాండ్ చేసే స్థాయిలో నిలిచింది. అటు బౌలింగ్ లోనూ సత్తా చాటుతోంది.

202/0 రన్స్ ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ వడివడిగా పరుగులు సాధించారు. 84 రన్స్ క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్.. కొద్దిసేపటికే సెంచరీ పూర్తిచేశాడు. తొలిరోజు సెంచరీ చేసిన రోహిత్… రెండోరోజు డబుల్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయాడు. రోహిత్ శర్మ 23 ఫోర్లు, 6 సిక్సర్లతో 244 బాల్స్ లో 176 రన్స్  చేసి తొలి వికెట్ గా వెనుదిరిగాడు.

మయాంక్ అగర్వాల్ డబుల్ మ్యాజిక్

మయాంక్ అగర్వాల్ మార్వలెస్ ఇన్నింగ్స్ ఆడాడు. డబుల్ సెంచరీతో అందరినీ ఆకట్టుకున్నాడు.  371 బాల్స్ లో 23 ఫోర్లు, 6 సిక్సర్లతో 215 రన్స్ చేసి ఔటయ్యాడు మయాంక్ అగర్వాల్.రోహిత్ శర్మతో కలిసి భారీ ఇన్నింగ్స్ ను నిర్మించాడు.

రికార్డ్ ఓపెనింగ్ పార్ట్ నర్ షిప్

సౌతాఫ్రికాపై ది బెస్ట్ పార్ట్ నర్ షిప్ అందించారు రోహిత్, మయాంక్. తొలి వికెట్ కు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ ల 317 పరుగుల తొలివికెట్ భాగస్వామ్యం ఇండియాకు మూడో అత్యధికం.

ఆ తర్వాత.. పుజారా 6 , కోహ్లీ 20, రహానే 15, జడేజా 30*, విహారి 10, సాహా 21, అశ్విన్ 1* రన్స్ చేశారు. 7 వికెట్ల నష్టానికి 502 రన్స్ స్కోరు దగ్గర భారత తొలి ఇన్నింగ్స్ ను కోహ్లీ డిక్లేర్ చేశాడు.

అశ్విన్ దెబ్బ మీద దెబ్బ

ఆ తర్వాత సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. 5 రన్స్ చేసిన మార్క్ రమ్ ను రవిచంద్రన్ అశ్విన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత.. డిబ్రూన్(4), డేన్ పీడ్(0) లను కూడా పెవీలియన్ కు పంపించాడు. తొలి టెస్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా 3వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది.