ఇదిగో మా నిర్భయ్.. చైనాకు బుద్ధి చెబుతున్న భారత సైన్యం

లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వద్ద క్షిపణిలను మోహరించిన చైనాకు భారత్ బుద్ధి చెబుతోంది.  చైనా క్షిపణిలు మోహరింపును ఎదుర్కునేందుకు మనదేశ సూపర్‌సానిక్ క్రూయిజ్ క్షిపణి నిర్భయ్‌ను  భారత్  విడుదల చేసింది.

1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల లక్ష్యాన్ని చేధించగల సూపర్‌సానిక్ క్రూయిజ్ క్షిపణి నిర్భయ్‌.. భూమి నుండి 100 మీటర్ల నుండి నాలుగు కిలోమీటర్ల మధ్య ఎగురుతుంది. అదే సమయంలో ముందున్న లక్ష్యాన్ని చేధిస్తుంది.

కాగా ఈ క్షిపణిని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసింది. ఏడు సంవత్సరాలు పరీక్షించిన తరువాత ఎల్ఏసీ వద్ద మోహరించింది సైన్యం.

ప్రస్తుతానికి పరిమిత స్థాయిలో క్షిపణిలు మోహరించినట్లు..పూర్తి స్తాయిలో క్లియరెన్స్ వచ్చిన వెంటనే మరిన్ని నిర్భయ్ లు ఎల్ఏసీలో మోహరించనున్నాయి.

చైనా క్షిపణి మోహరింపు

ఇండియా టుడే కథనం ప్రకారం  భారత సరిహద్దు వెంబడి ప్రాంతమైన  టిబెట్‌లోని కొత్త ప్రదేశాలలో చైనా డిజైన్ చేసిన సర్ఫేజ్ ఏయిర్ మిసైళ్లను మోహరించింది.  సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడఖ్ సరిహద్దుల్లో ప్రాంతాల్లోకి వచ్చాయి. చైనా దురాక్రమణకు బుద్ధి చెప్పేలా కేంద్రం  నిర్భయ్ క్షిపణులను మోహరించడమే కాకుండా, భూమిపై ఉన్న భారత దళాలకు కఠినమైన చలికాలంలో  పనిచేయగల ట్యాంకులు, వాహనాల్ని సైతం సిద్ధం చేసింది.

 

Latest Updates