ఇటలీ నుంచి 218 మంది భారతీయుల తరలింపు

కరోనా ఎఫెక్ట్ తో విదేశాల్లో ఉన్న భారతీయులు స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ఇరాన్, ఇటలీలో చిక్కుకున్న భారతీయులను కేంద్ర ప్రభుత్వం స్వదేశానికి తీసుకొస్తోంది. లేటెస్ట్ గా నిన్న(శనివారం) ఇటలీ మిలన్ నుంచి 218 మంది భారతీయులతో ప్రత్యేక ఎయిర్ ఇండియా విమానం ఇండియాకు బయలుదేరింది. ఇవాళ(ఆదివారం) ఉదయం ఢిల్లీకి చేరుకుంది. వచ్చిన వారిలో 211 మంది విద్యార్థులు ఉండగా..ఇందులో ఏడు కరోనా అనుమానిత కేసులున్నాయి. వారికోసం ప్రత్యేకంగా 50 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. విమానంలో ఉన్నంత సేపు ప్రయాణికులు ఒకరికొకరు మాట్లాడుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అంతేకాదు జర్నీ సమయంలో వారికి తేలికపాటి ఆహారాన్ని మాత్రమే ఇచ్చారు. కరోనా అనుమానితులను రాజస్థాన్ లోని జైసల్మేర్ లేదా ఢిల్లీకి సమీపంలో ఉన్న ఐసోలేషన్ వార్డులకు తరలించి చికిత్స అందించనున్నారు.

Latest Updates