రష్యాకు ఒక బిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్స్: మోడీ

ప్రధాని మోడీ రష్యా పర్యటన ముగిసింది. ఈస్ట్రన్ ఎకనమిక్ ఫోరం ప్లీనరీలో మాట్లాడిన మోడీ… రష్యాకు ఒక బిలియన్ డాలర్ లైన్ ఆఫ్ క్రెడిట్ ప్రకటించారు. హార్మూజ్ జలసంధిలో భారతీయ నౌకలను కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు. జపాన్, మలేషియా, మంగోలియా దేశాధినేతలతో సమావేశమయ్యారు. మిత్రదేశాల్లోని వేర్వేరు ప్రాంతాల అభివృద్ధి కోసం భారత్ చురుకుగా పనిచేస్తుందన్నారు.

రష్యాలోని వ్లాదివోస్టోక్ లో జరుగుతున్న ఈస్ట్రన్ ఎకనమిక్ ఫోరం ప్లీనరీ సెషన్ లో మోడీ పాల్గొన్నారు. ఫారీస్ట్ తో భారత సంబంధాలు చాలా పురాతనమైనవన్నారు. వ్లాదివోస్టోక్ లో కాన్సులేట్ ఓపెన్ చేసిన మొదటి దేశం భారతేనన్నారు. సోవియట్ గా ఉన్నప్పుడు కూడా అనేక ఆంక్షలున్నా… వ్లాదివోస్టోక్ లో భారతీయులకు ప్రవేశం ఉండేదన్నారు. 2024 కల్లా 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని చెప్పారు.

హార్ముజ్ జలసంధిని దాటుకుంటూ వచ్చే భారత ఆయిల్ ట్యాంకర్లకు భద్రత ఏర్పాటు చేశామన్నారు మోడీ. ఈ మధ్య ఇరాన్ లో జరుగుతున్న ఘటనలు, ఓడలను సీజ్ చేయటం లాంటి పరిణామాలతో.. వాటి ప్రభావం ఆయిల్ ట్యాంకర్లపై పడకుండా సెక్యూరటీ పెట్టామన్నారు. ఇరాన్ అంతర్గత అంశాల్లో కల్పించుకునే ఉద్దేశం భారత్ కు లేదన్నారు.

Latest Updates