దేశ ప్రజల్లో కరోనా నిరోధక శక్తి పెరగలేదు : మంత్రి హర్షవర్ధన్

దేశ ప్రజలలో కరోనా నిరోధక శక్తి పెరగలేదన్నారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో నిర్వహిచిన  సీరో సర్వేలో ఈ విషయం తెలిసిందన్నారు. కరోనా సోకిన తర్వాత కోలుకున్న వారిలో కూడా యాంటీ బాడీస్ పెరగడం లేదనీ… వారిలో కూడా కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయనీ సర్వేలో తేలినట్లు మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ఐసీఎంఆర్ రెండో సీరో సర్వే నివేదిక అతి త్వరలోనే విడుదల కానుందన్నారు. ప్రజల అలవాట్లను మార్చుకోవడం ద్వారానే ఈ వైరస్ దరి చేరకుండా ఉంటుందన్న ఆయన.. ఇంతవరకూ కరోనా వ్యాధి నిరోధక శక్తి పెరగలేదన్నారు. ప్రస్తుతానికి కరోనా రెండోసారి వచ్చిన వారి సంఖ్య నామమాత్రంగానే ఉందని, అయినా ఈ విషయాన్ని తీవ్రంగానే పరిశీలిస్తున్నామని చెప్పారు మంత్రి.

Latest Updates