సౌతాఫ్రికాతో వన్డే: భారత టీమ్ ఇదే

ముంబై: న్యూజిలాండ్ సిరీసుల్లో ఘోరంగా విఫలమైన టీమిండియా మరో సిరీస్ కు రెడీ అయ్యింది. మార్చి 12-18 వరకు సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ పై కన్నేసింది కోహ్లీ సేన. ఈ క్రమంలోనే 3 మ్యాచ్ ల సిరీస్ కు సంబంధించిన భారత టీమ్ ను ఆదివారం అనౌన్స్ చేసింది BCCI.  మూడు మ్యాచ్‌ ల సిరీస్‌ కు 15 మంది ప్లేయర్లతో  టీమ్‌ ను కొత్త సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. వన్డే టీమ్ కు విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీ వహించనున్నాడు. కొతంత సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ సునీల్‌ జోషీ నేతృత్వంలోని ఐదుగురు సెలక్టర్ల టీమ్ సఫారీలతో సిరీస్‌ కు జట్టును ఎంపిక చేసింది.

గాయాల నుంచి కోలుకొని ఫిట్‌నెస్‌ సాధించిన సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, హార్దిక్‌ పాండ్య , పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ జాతీయ జట్టులోకి రీ ఎంట్రీ చేశారు. న్యూజిలాండ్‌ పర్యటనలో గాయపడి మిగతా సిరీస్‌ కు దూరమైన రోహిత్‌ శర్మకు చోటుదక్కలేదు. భువీ జట్టులోకి రావడంతో మరో పేసర్‌ మహ్మద్‌ షమీకి రెస్ట్ ఇచ్చారు.

భారత టీమ్ ఇదే:

శిఖర్‌ ధావన్‌, పృథ్వీ షా, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, మనీశ్‌ పాండే, శ్రేయాస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌, హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, యుజువేంద్ర చాహల్‌, బుమ్రా, నవదీప్‌ సైనీ, కుల్దీప్‌ యాదవ్‌, శుభమన్‌ గిల్‌

 

 

Latest Updates