చైనాకు మరో షాక్ ఇచ్చిన భారత్

న్యూఢిల్లీ: చైనాకు మరో షాక్ ఇచ్చింది భారత్. చైనా నుంచి ACల దిగుమతిని నిషేధించింది. స్ప్లిట్ సిస్టమ్ ఏసీలతో పాటు రిఫ్రిజిరాంట్ ఉన్న ఇతర ఏసీల దిగుమతులను నిషేధిస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిఫ్రిజిరాంట్ ఉన్న ఏసీలను ఫ్రీ కేటగిరీ నుంచి ప్రొహిబిటెడ్ కేటగిరీలోకి మార్చింది.

ఆత్మనిర్భర్ భారత్ క్యాంపెయిన్ లో భాగంగా… ఏసీలను దేశీయంగానే ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. గతంలో అగర్ బత్తీలు, టైర్లు, టీవీలను బ్యాన్ చేసింది ప్రభుత్వం. దేశీయంగా ఏసీల మార్కెట్ విలువ 5 నుంచి 6 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. దీంతో మనదేశంలోనే వాటి ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు DGFT చైనా ఏసీలను బ్యాన్ చేసింది.

Latest Updates