- ఇండియా@ 1
దుబాయ్: గబ్బాలో స్టన్నింగ్ విక్టరీ కొట్టిన ఇండియా.. ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) స్టాండింగ్స్లోనూ నెంబర్‌వన్ ప్లేస్‌ను సొంతం చేసుకుంది. ఆసీస్‌పై సిరీస్ విజయంతో ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 430 పాయింట్లు ఉన్నాయి. న్యూజిలాండ్ (420), ఆస్ట్రేలియా (332)లు వరుసగా సెకండ్, థర్డ్ ప్లేస్ల్లో కొనసాగుతున్నాయి. డబ్ల్యూటీసీలో ఐదు సిరీస్‌ల్లో భాగంగా ఇండియా 13 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 9 గెలవగా, మూడు ఓడింది. దీంతో టీమ్ 71.7 శాతం పాయింట్లను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్, సౌతాఫ్రికా వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లోనూ ఇండియా (117.65 రేటింగ్ పాయింట్స్) రెండో ర్యాంక్‌కు ఎగబాకింది. న్యూజిలాండ్ (118.44) టాప్‌లో ఉంది.
For More News..