ఫస్ట్ సెమీ హై స్పీడ్ రైలు ప్రారంభం:’వందేభారత్’ గాడీ హైలైట్స్

ఢిల్లీ : మొట్టమొదటి సెమీ హై స్పీడ్ లగ్జరీ రైలు “వందే భారత్ ఎక్స్ ప్రెస్” పట్టాలపైకి ఎక్కింది. కొన్నిరోజుల ట్రయల్ రన్ తర్వాత.. ఇవాళ్టినుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీలోని రైల్వే స్టేషన్ లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించారు. అక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ఈ సభలో పాల్గొన్నారు. ప్రారంభించడానికి ముందు పీఎం మోడీ, మంత్రి పియూష్ గోయల్ ఈ రైలులో సదుపాయాలను పరిశీలించారు.

ఢిల్లీ నుంచి వారణాసి వరకు నడిచే ‘వందే భారత్ ఎక్స్ ప్రెస్'(సెమీ హై స్పీడ్ ట్రెయిన్ 18) రైలును మొదటగా ప్రారంభించారు. ఈ రైలు సేవలు త్వరలోనే ఇండియా అంతటికీ అందుబాటులోకి వస్తాయని కేంద్రం తెలిపింది. ఢిల్లీ నుంచి 9గంటల 45 నిమిషాల్లో ఈ రైలు ప్రయాణికులను వారణాసికి చేర్చుతుంది. శతాబ్ది ట్రైయిన్స్ లాగానే.. గంటకు 160 కి.మీ వేగంతో వందే భారత్ ఎక్స్ ప్రెస్ దూసుకెళ్తుంది. మధ్యలో కాన్పూర్, అలహాబాద్  స్టేషన్లలో 40 నిమిషాల చొప్పున ఆగుతుంది.

లగ్జరీ సదుపాయాలు హైలైట్

 • వందే భారత్ ఎక్స్ ప్రెస్ .. శతాబ్ది ఎక్స్ ప్రెస్ లాగే దూసుకెళ్తుంది. కానీ.. వందే భారత్ ఎన్నో లగ్జరీ సదుపాయాలను చేర్చారు.
 • సీటింగ్ నుంచి… క్యాబిన్ల డిజైన్ వరకు అంతా సూపర్ క్లాస్.
 • గాడీలో 16 ఎయిర్ కండిషన్డ్(A/C) కోచ్ లు ఉన్నాయి. వీటిలో రెండు ఎగ్జిక్యూటివ్ క్లాస్ లు.
 • 1,128 మంది  ఒకేసారి జర్నీ చేయొచ్చు.
 • అన్ని బోగీల్లోనూ ఆటోమేటెడ్ డోర్స్ ఉంటాయి.
 • జీపీఎస్ బేస్డ్ ఆడియో విజువల్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పెట్టారు.
 • వినోదం, సమాచారం కోసం ప్రతి బోగీలో హాట్ స్పాట్ వై-ఫై ఫెసిలిటీ
 • అన్ని బోగీల్లో బయో వాక్యూమ్ టాయిలెట్లు
 • ప్రతి బోగీలో కాంతిమంతమైన లైట్లు.. ప్రతి సీటుకు పర్సనల్ లైటింగ్ సిస్టమ్
 • ప్రతి బోగీలో చిన్నగది. అక్కడే అందుబాటులో వేడి వేడి ఆహారం.. చల్లచల్లని డ్రింక్స్. అమ్మేవాళ్ల అరుపులు లేకుండా కామ్ గా ఉండేలా, ప్యాసింజర్లకు ఇబ్బంది లేకుండా.. వేడివేడిగా అందించాలనే ఉద్దేశంతో ప్రతి బోగీకి ఈ ఏర్పాటుచేశారు.
 • 30శాతం విద్యుత్ ను ఆదా చేసేలా… గ్రీన్ ఫుట్ ప్రింట్ర్స్ కాన్సెప్ట్ తో రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ను ఏర్పాటుచేశారు.
 • చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ రైలును డిజైన్ చేసింది. ఇంట్లో ఉన్నట్టే అనిపించేలా రైలు బోగీలను తీర్చిదిద్దింది. 18 నెల్లలోనే ఈరైలును అందుబాటులోకి తెచ్చింది.

Latest Updates