జాతి వ్యతిరేక శక్తులకు దీటుగా బదులిస్తున్నాం

వారణాసి: జాతి వ్యతిరేక శక్తులకు తగిన రీతిలో బుద్ధి చెబుతున్నామని ప్రధాని మోడీ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌‌లోని వారణాసిలో నిర్వహించిన హందితా-రాజాతలాబ్ నేషనల్ హైవే ప్రారంభోత్సవంలో మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్త వ్యవసాయ చట్టాలతోపాటు నేషనల్ సెక్యూరిటీ గురించి మోడీ పలు విషయాలు మాట్లాడారు. ‘జాతి కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు జోహార్లు. విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న శక్తులకు మేం గట్టిగా బదులిస్తున్నాం. భారత్‌‌లోకి చొరబడటానికి యత్నిస్తున్న వాళ్లతోపాటు ఇండియా నుంచి ఇండియాను విడదీయడానికి కుట్రలు పన్నుతున్న వారికి దీటుగా బదులిస్తున్నాం’ అని మోడీ పేర్కొన్నారు.

Latest Updates