ప్రపంచాన్ని నడిపించే శక్తి ఇండియాకు ఉంది: మోడీ

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని నడిపించే సంకల్ప శక్తి భారత్‌కు ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. తొలుత ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన మోడీ ఆ తర్వాత మాట్లాడారు. 1.3 బిలియన్‌ల మంది దేశ ప్రజలను నడిపించే మంత్రంగా ఆత్మనిర్భర్ మారిందన్నారు. మనం ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలతోపాటు కరోనా మహమ్మారి లాంటి ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనేలా దేశాన్ని మారుస్తున్నామని చెప్పారు.

‘ఈ కలను ఇండియా తెలుసుకుంటుందని నేను నమ్మకంగా ఉన్నా. నా తోటి భారతీయుల సామర్థ్యం, విశ్వాసం, శక్తి యుక్తులపై నేను పూర్తి నమ్మకంతో ఉన్నా. ఒక్కసారి మనం ఏమైనా చేయాలని సంకల్పిస్తే ఆ లక్ష్యాన్ని చేరుకునేంత వరకు విశ్రమించం. మొత్తం ప్రపంచం ఓ కుటుంబమని ఇండియా ఎప్పుడూ నమ్ముతూ వస్తోంది. ఎకనామిక్ గ్రోత్, డెవలప్‌మెంట్‌పై ఫోకస్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ ప్రయాణంలో కీలక పాత్ర పోషించే మానవత్వాన్ని నిలబెట్టడం అత్యావశ్యకం. కరోనా కారణంగా నెలకొన్న ఆపత్కర పరిస్థితుల్లో మన డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ స్టాఫ్​, అంబులెన్స్ సిబ్బంది, స్వీపర్లు, పోలీసులు, సర్వీస్‌మెన్‌తోపాటు చాలా మంది ప్రజలు తమ ప్రాణాలను లెక్క చేయకుండా సేవ పరమో ధర్మ స్ఫూర్తితో సేవలందించారు’ అని మోడీ పేర్కొన్నారు.

Latest Updates