ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే అంశాలను భారత్ ఏరివేసింది : మోడీ

దేశంలో ఉగ్రవాదాన్ని, వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించే అంశాలను భారత్ ఏరివేసిందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. బ్యాంకాక్ లో జరిగిన సావాస్ దీ మోడీ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. కశ్మీర్ ప్రత్యేక హోదాను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకున్నారు మోడీ. థాయ్ లాండ్, భారత్ మధ్య అనేక సారూప్యతలున్నాయమన్నారు మోడీ.

హ్యుస్టాన్‌ లో ప్రధాని మోడీ నిర్వహించిన సభకు విశేష స్పందన వచ్చింది. దానిని ఆదర్శంగా తీసుకొని బ్యాంకాక్‌ లో సవాస్‌ ‌దీ పీఎం మోడీ కార్యక్రమానికి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలు హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్‌ లో ఆర్టికల్ 370ను రద్దు చేయడం గురించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నప్పుడు స్టేడియంలో ప్రజలు, మోడీ.. మోడి.. అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. సవాస్‌ దీ అంటే థాయ్‌ లో శుభాకాంక్షలు, వీడ్కోలు అని రెండు అర్థాలు ఉన్నాయి. సవా‌స్‌ దీ అనే పదం సంస్కృత పదం.. సవా‌స్‌ దీ అంటే సంస్కృతంలో శ్రేయస్సు అని అర్థం వస్తోంది.

 

Latest Updates