ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ఆదివారం (నవంబర్ 2) ప్రారంభమైంది. హోబర్ట్ వేదికగా బెల్లెరివ్ ఓవల్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఇండియా ఏకంగా మూడు మార్పులతో బరిలోకి దిగుతుంది. జితేష్ శర్మ, వాషింగ్ టన్ సుందర్, అర్షదీప్ సిన్గ్ ప్లేయింగ్ 11లో చోటు సంపాదించారు. సంజు శాంసన్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రానా బెంచ్ కే పరిమితమయ్యారు. మరోవైపు ఆస్ట్రేలియా ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది. హేజాల్ వుడ్ స్థానంలో సీన్ అబాట్ తుది జట్టులోకి వచ్చాడు.
ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. శుక్రవారం (అక్టోబర్ 31) మెల్ బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20లో ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలిచి తీరాల్సిందే.
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI):
మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్
భారత్ (ప్లేయింగ్ XI):
శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా
