ఇండియానే జీవుల మనుగడకు కారణమట..

ఒకప్పుడు ఇండియా ఆసియా ఖండానికి దూరంగా ఉండేది. కానీ, 5 కోట్ల ఏళ్లక్రితం ఎప్పుడైతే భారత ఉపఖండం ఆసియా ఖండాన్ని ఢీకొట్టి కలిసి పోయిందో అప్పుడే ప్రపంచ ముఖ చిత్రం మారిపోయిందట. భూమి, వాతావరణ పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయట. జీవం మనుగడకు ఇండియానే బాటలు వేసిందట. ఆసియాను ఢీకొట్టినప్పుడు మహాసముద్రాల్లో ఆక్సిజన్ స్థాయులు పెరిగిజీవి మనుగడకు అనువైన మార్గం ఏర్పడిందట. అమెరికాలోని ప్రిన్స్ టన్ యూనివర్సి టీ సైంటిస్టుల తాజా పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. మైక్రోస్కోపిక్ సీషెల్స్ ను ఉపయోగించి 7 కోట్ల ఏళ్ల క్రితం సముద్రాల్లోని నైట్రోజన్ స్థాయిలతో ఓ రికార్డును తయారు చేశారు. భూమిపై జీవం మనుగడకు నైట్రోజనే ముఖ్యం కాబట్టి.. దాన్నే పరిశోధనకు ఎంచుకున్నామని చెప్పారు.

నైట్రోజన్ కు ఎన్ 15, ఎన్ 14 అనే రెండు స్థిర ఐసోటోపులుంటాయని, ఆక్సిజన్ తక్కువున్నప్పుడు ఆరెండు ఐసోటోపుల నిష్పత్తి చాలా ఎక్కువగా ఉందని గుర్తించారు. దానికి కారణం వేడి నీళ్లలో ఆక్సిజన్ కలవదు కాబట్టి  అప్పటి వేడి వాతావరణ పరిస్థితులే అందుకు కారణమని ముందు భావించారు. కానీ, వాతావరణం వేడిగా ఉన్న5 కోట్ల ఏళ్ల క్రితం.. టెక్టానిక్ ప్లేట్ల కదలికల వల్ల ఆసియా ఖండాన్ని ఇండియా ఢీకొట్టడంతో అంచనాలన్నీ తారుమారయ్యాయని సైంటిస్టులు అంటున్నారు.

ఈ యాక్సిడెంట్​తో సముద్రాల్లోని టెక్టానిక్ ప్లేట్లూ కదిలాయని, ఆక్సిజన్ స్థాయులుపెరిగి సముద్రంలోని జీవుల మనుగడకు బాటలుపడ్డాయని అన్నారు. అంతేకాదు.. ప్రస్తుతం గ్లోబల్​ వార్మింగ్ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో దాని ఎఫెక్ట్​ భవిష్యత్తులో జీవజాతులపై ఎలా ఉండబోతోందనేది తెలుసుకో వచ్చనీ అంటున్నారు. కాగా, ఓషన్ డ్రిల్లింగ్ ప్రోగ్రాంలో భాగంగా నార్త్​ అట్లాంటిక్ , నార్త్​ పసిఫిక్ , సౌత్ అట్లాంటిక్ మహా సముద్రాల నుంచి ఫోరామినిఫెరా అనే జీవుల షెల్స్ ను సేకరించారు. వాటిలోని నైట్రోజన్ ఐసోటోపుల నిష్పత్తిని పరీక్షించి.. ఇండియానే జీవుల మనుగడకు కారణమని నిర్ధారించారు.

Latest Updates