దేశానికి ఆడటాన్ని మించిన గొప్ప ఫీలింగ్ మరొకటి లేదు

సిడ్నీ: ఆస్ట్రేలియా సిరీస్‌‌కు టీమిండియా సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా కంగారూ గడ్డపై చేరుకున్న భారత జట్టు ఆదివారం ప్రాక్టీస్‌‌ను ప్రారంభించింది. ప్రాక్టీస్ సెషన్‌‌కు సంబంధించి ఓ వీడియోను ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘దేశం తరఫున ఆడటం కంటే గొప్ప అనుభూతి ఇంకొకటి ఉండదు. టీమిండియా నెట్స్‌‌లో బౌలింగ్ చేయాలన్న సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెర పడింది. ఆస్ట్రేలియా టూర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’ అని షమి ట్వీట్ చేశాడు. టీమిండియా తరఫున మూడు ఫార్మాట్లకు షమి సెలెక్ట్ అయ్యాడు. ఈ నెల 27న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌‌లో జరిగే తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. రీసెంట్‌గా ముగిసిన ఐపీఎల్‌‌లో షమి 20 వికెట్లతో తన సత్తా చాటాడు.

Latest Updates