ఒలింపిక్స్ ప్రిపరేషన్స్ లో బెస్ట్ స్టేజ్ లో ఇండియా

స్పోర్ట్స్ మినిస్టర్ కిరిణ్ రిజిజు
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఈ ఏడాది జూలైలో జరగాల్సిన సమ్మర్ ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. దీంతో విశ్వ క్రీడల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న క్రీడాభిమానులతోపాటు ఏళ్లుగా శ్రమిస్తున్న అథ్లెట్స్ కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు. కాగా, లాక్ డౌన్ తో అథ్లెట్ల ట్రెయినింగ్ నిలిచిపోయింది. మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందడంతో స్పోర్ట్స్ ప్లేయర్స్ ఇండోర్స్ కే పరిమితమవ్వాల్సి వచ్చింది. జర్మనీ లాంటి దేశాల్లో బుండెస్లిగా లాంటి తిరిగి మొదలవగా.. మిగతా స్పోర్ట్స్ కూడా మళ్లీ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై స్పోర్ట్స్ మినిస్టర్ కిరిణ్ రిజిజు స్పందించారు. మన అథ్లెట్ల ట్రెయినింగ్ దెబ్బతిన్నప్పటికీ, ఒలింపిక్స్ కు ఇండియా సన్నద్ధత చాలా బాగుందని కిరణ్ రిజిజు తెలిపారు.

‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ను పలు రంగాలకు చెందిన ఎక్స్ పర్ట్స్ రూపొందించిన పూర్తి స్థాయి స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ గా మార్చడానికి ప్రయత్నిస్తున్నాం. దీనికి సంబంధించి అన్ని ఫెడరేషన్స్, బాడీస్ కు నివేదించాం. హోం మినిస్ట్రీతోపాటు లోకల్ అథారిటీస్ జారీ చేసిన గైడ్ లైన్స్ ప్రకారం ప్లేయర్స్ హెల్త్, సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని వారికి సూచించాం. ఈవెంట్స్ ను తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నాం. కానీ అంతకంటే ముందు ట్రెయినింగ్, ప్రాక్టీస్ ను మళ్లీ మొదలెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే హాస్టల్స్ తోపాటు ఇళ్లలో ఉన్న అథ్లెట్ల ఫిట్ నెస్ ను కోచ్ లు ట్రాక్ చేస్తున్నారు. ఒలింపిక్స్ కు ఇంకా చాలా సమయం ఉంది. టోక్యో గేమ్స్ నిర్వహణ కోసం జపాన్ ప్రభుత్వానికి ప్రతి దేశం అండగా నిలవాలి. ఒలింపిక్స్ కోసం ఇండియా ప్రిపరేషన్స్ విషయంలో మనం బెస్ట్ స్టేజ్ లో ఉన్నాం. ఈ టోర్నీలో ఇండియా చాలా మెడల్స్ గెలిచే అవకాశాలున్నాయి. కానీ, మనం టాప్–10 లేదా టాప్–5లో నిలిచే ఛాన్స్ ఉందని మాత్రం చెప్పలేను.2028లో టాప్–10 నిలవాలన్నదే మన లాంగ్ టర్మ్ ప్లాన్’ అని రిజిజు చెప్పారు.

Latest Updates