మిమ్మల్ని చూసి దేశం గర్విస్తోంది: రాజ్ నాథ్

న్యూఢిల్లీ: డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్ డీవో) శాస్త్రవేత్తలను రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మెచ్చుకున్నారు. మిమ్మల్ని (సైంటిస్టులను ఉద్దేశించి) చూసి దేశం గర్విస్తోందని ప్రశంసించారు. హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమోన్ స్ట్రేటర్ వెహికిల్ (హెచ్ఎస్టీడీవీ)ని డీఆర్ డీవో విజయవంతంగా ప్రయోగించింది. ఈ నేపథ్యంలో ఈ టెక్నాలజీ ప్రధాని మోడీ విజన్ అయిన ఆత్మనిర్భర్ భారత్ లో  చారిత్రక మైలురాయి అని రాజ్ నాథ్ చెప్పారు. ‘డీఆర్ డీవో ఇండియా సక్సెస్ ఫుల్ గా హైపర్ సోనిక్ డెమోన్ స్ట్రేటర్ వెహికిల్ ను ప్రయోగించింది. ఇందులో దేశీయంగా తయారు చేసిన స్క్రామ్ ప్రొపల్షన్ సిస్టమ్ ను వాడారు. ఈ విజయంతో అన్ని క్లిష్టమైన టెక్నాలజీలు తర్వాతి లెవల్ ప్రోగ్రెసింగ్ కు చేరుకుంటాయి. ఈ ప్రాజెక్టులో పని చేసిన సైంటిస్టులతో మాట్లాడా. ఈ అచీవ్ మెంట్ సాధించినందుకు వారికి కంగ్రాట్స్ చెప్పా. వారిపై దేశం గర్వంగా ఉంది’ అని రాజ్ నాథ్ ట్వీట్స్ లో పేర్కొన్నారు.

Latest Updates