ఇండియానే వరల్డ్ బ్యాంకు నుంచి ఎక్కువ అప్పు తీసుకుంది

వివిధ ప్రాజెక్టులు, అభివృద్ధి పథకాల కోసం అన్ని దేశాలు వరల్డ్ బ్యాంకు నుంచి అప్పు తీసుకుంటాయి. దీనికి సంబంధిత నియమాలు, నిబంధనలు ఉంటాయి. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇండియా.. ప్రపంచ బ్యాంకు నుంచి అత్యధికంగా అప్పు తీసుకుంది. గత 10ఏళ్ల నుంచి ప్రపంచ బ్యాంకు నుంచి భారతదేశం తీసుకునే అప్పు పెరుగుతూనే ఉంది. గత నాలుగేళ్లలోనే 5 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది.

2009 నుంచి తీసుకుంటోన్న అప్పు ఏటేటా పెరుగుతోంది. ఈ రుణంతో కీలక రంగాలపై ఖర్చుచేస్తోంది. అయితే 2010 తర్వాత ప్రపంచ బ్యాంకు అన్నిదేశాలకు ఇచ్చే రుణాన్ని తగ్గిస్తోంది. 2010 ఆర్థిక మాంద్యం ఏర్పడటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక వరల్డ్ బ్యాంక్ నుంచి ఇండియా తీసుకున్న రుణం ద్వారా రహదారుల అభివృద్ధి, విద్యుత్, మౌలిక వసతుల సదుపాయాల కల్పన, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, విపత్తుల నిర్వహణశాఖ కోసం ఖర్చు చేస్తోంది. 2010లో ఇండియా 9.3 బిలియన్ డాలర్ల రుణం తీసుకుంది.

Latest Updates