ఇండియా రన్నరప్​తో సరి

జొహర్‌‌‌‌‌‌‌‌ బహ్రు (మలేసియా): సుల్తాన్‌‌‌‌‌‌‌‌ జోహర్‌‌‌‌‌‌‌‌ కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా జూనియర్‌‌‌‌‌‌‌‌ హాకీ టీమ్‌‌‌‌‌‌‌‌ రన్నరప్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో ఇండియా 1–2తో గ్రేట్‌‌‌‌‌‌‌‌ బ్రిటన్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడి రెండో స్థానంలో నిలిచింది. టీమిండియా తరఫున గురుసాహిబ్జిత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ (49వ ని.) ఏకైక గోల్‌‌‌‌‌‌‌‌ చేయగా, బ్రిటన్‌‌‌‌‌‌‌‌కు స్టువర్ట్‌‌‌‌‌‌‌‌ రుష్‌‌‌‌‌‌‌‌మెర్‌‌‌‌‌‌‌‌ (50, 52వ ని.) రెండు గోల్స్‌‌‌‌‌‌‌‌ అందించాడు.

బ్రిటన్‌‌‌‌‌‌‌‌కు ఇది మూడో టైటిల్‌‌‌‌‌‌‌‌ కావడం విశేషం. మ్యాచ్‌‌‌‌‌‌‌‌ ఆరంభం నుంచి ఇండియా బలమైన దాడులతో పదేపదే బ్రిటన్‌‌‌‌‌‌‌‌ సర్కిల్‌‌‌‌‌‌‌‌లోకి దూసుకెళ్లినా తొలి మూడు క్వార్టర్స్​ ఇరుజట్లు గోల్స్​ చేయలేకపోయాయి. నాలుగో క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో లభించిన ఏడో పెనాల్టీని మణిందర్‌‌‌‌‌‌‌‌ గోల్‌‌‌‌‌‌‌‌పోస్ట్‌‌‌‌‌‌‌‌లోకి పంపడంతో ఇండియా 1–0 ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ తర్వాతి కొద్ది నిమిషాల్లోనే రుష్‌‌‌‌‌‌‌‌మెర్‌‌‌‌‌‌‌‌ రెండు గోల్స్​ చేశాడు.

 

Latest Updates