క‌రోనా వ్యాక్సిన్ కోసం ప్ర‌పంచ‌మంతా భార‌త్ వైపు చూస్తోంది:బిల్ గేట్స్

ప్రపంచవ్యాప్తంగా కరోనా కట్టడిలో భారత్​ కీలక పాత్ర పోషిస్తోందన్నారు ​ మైక్రోసాఫ్ట్​ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్. కరోనా వైరస్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చ‌రింగ్ లో భారత్​ ముఖ్య పాత్ర పోషిస్తుందని, ఒకసారి వ్యాక్సిన్​ బయటకు వచ్చాక.. దాన్ని భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి సరఫరా చేసేందుకు ప్రపంచ దేశాలు భారత్​వైపు చూస్తున్నాయని ​ తెలిపారు. వచ్చే ఏడాదిలో వ్యాక్సిన్ వస్తుందని ఆశిస్తున్నామన్న బిల్ గేట్స్… అది సమర్థంగా పనిచేస్తుంది, భద్రంగా ఉందని తెలిసిన వెంటనే.. ప్రపంచ దేశాలు భారత్​వైపు చూస్తాయన్నారు. వీలనైంత తక్కువ సమయంలో భారత్​.. టీకాను భారీ స్థాయిలో ఉత్పత్తి చేసి ప్రపంచ దేశాలకు అందిస్తుందని తెలిపారు. భారీ స్థాయిలో వ్యాక్సిన్​ను ఉత్పత్తి చేసి… దాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవాలన్న భారత్​ సంకల్పం ఇందుకు తోడ్పడుతుందన్నారు. సీరం ఇన్​స్టిట్యూట్​, భారత్​ బయోటెక్, బయో-ఈ​ వంటి భారత సంస్థలను ప్రస్తావించారు బిల్​ గేట్స్​. వీటి సామర్థ్యంతో వ్యాక్సిన్​ తయారీ సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్​ ను తీసుకుని భారత్​లో ఉత్పత్తి చేయాలన్న ఆలోచన మాకు ఉంది. అస్ట్రాజెనెకా, ఆక్స్​ఫర్డ్​, జాన్సన్​ అండ్​ జాన్సన్​ నుంచి వచ్చిన టీకాను భారత్​ కు అప్పగిచాలని అలోచిస్తున్నామన్నారు. వీటికి సంబంధించి భారీ డోసులను సీరం ఉత్పత్తి చేసే విషయంపై మాట్లాడుకున్నామని..బయో-ఈతోనూ చర్చలు జరుగుతున్నాయన్నారు బిల్ గేట్స్ . ఇప్పటికే  బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌ ద్వారా బిల్‌గేట్స్ .. కరోనాపై పోరాటానికి మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం ప్రకటించారు.

Latest Updates