ఆసీస్‌ చేతిలో ఇండియా చిత్తు

పెర్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: ఆస్ట్రేలియా టూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇండియా హాకీటీమ్‌ కు తొలి దెబ్బ పడింది. ఐదు మ్యాచ్‌ ల సిరీస్‌ లో తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓటమి ఎరుగని టీమిండియాకు ఆస్ట్రేలియా షాకిచ్చింది. బుధవారం జరిగిన నాలుగోమ్యా చ్‌ లో ప్రపంచ రెండో ర్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆసీస్‌ 4–0 తో ఐదో ర్యాంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇండియాను  చిత్తు గా ఓడించింది. బ్లేక్‌ గోవర్స్‌ (15, 60వనిమిషాల్లో ),  జెరెమీ హేవర్డ్‌ (20,59వనిమిషాల్లో ) చెరో రెండు గోల్స్‌ చేసి హోమ్‌ టీమ్‌ కు ఘన విజయం కట్టబెట్టారు.మ్యా చ్‌ ఆరంభంలో ఆసీస్‌ పై మన జట్టుదే పై చేయి అయింది. ఐదో నిమిషంలోనే  పెనాల్టీ కార్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లభించిం ది. అయితే, హర్మన్‌ ప్రీత్‌ సిం గ్‌ కొట్టిన షాట్‌ ను ప్రత్యర్థి ప్లేయర్లు నిలువరిం చారు. కాసేపటికే  పుంజుకున్న ఆసీస్‌ ఐదు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్‌ కొట్టి ఇండియాను ఆత్మ రక్షణలోకి  నెట్టింది. ఖాతా తెరిచేందుకు అనేక ప్రయత్నాలు చేసిన ఇండియా చివర్లో కీపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తప్పించి ఎక్స్‌ ట్రా ప్లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఆడినా ఫలితం లేకపోయిం ది.

Latest Updates