సోషల్ మీడియాలో ట్రోలింగ్ : అతడి వల్లే ఇండియా ఘోరంగా ఓడిపోయింది

పసికూన అనుకున్న బంగ్లాదేశ్ ఇండియాపై గెలచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. అయితే దీనికి కారణం టీమిండియా ప్లేయర్ రిషభ్ పంతే అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తుంది. బంగ్లాదేశ్‌ తో ఆదివారం జరిగిన మ్యాచ్‌ లో వికెట్ల వెనక విఫలమైన పంత్.. DRS విషయంలోనూ విఫలమయ్యాడంటున్నారు. లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ మంచి ఊపుమీద ఉంది. ఇన్నింగ్స్ పదో ఓవర్‌లో చాహల్ వేసిన ఓ బాల్ సౌమ్య సర్కారు బ్యాటును రాసుకుంటూ పంత్‌ చేతుల్లో పడింది. దీంతో అవుటని భావించిన పంత్ అప్పీల్ చేశాడు. అంపైర్ నాటౌట్ అన్నాడు.

అయితే, బాల్ బ్యాట్‌ కు తాకిందని కాన్ఫిడెన్స్ గా నమ్మిన పంత్.. కెప్టెన్ రోహిత్‌ ను ఒప్పించి DRSకు వెళ్లాడు. రివ్యూలో బాలో బ్యాట్‌ కు తాకలేదని తేలింది. దీంతో పంత్ వైపు చూసిన రోహిత్ నవ్వుతూ ఏదో అనడం వీడియోలో కనిపిస్తోంది. రిష భ్ కూడా ఏదో చెప్పడం కనిపించింది. ఇది చూసిన ప్రేక్షకులు ఇకనైనా ధోనీని చూసి నేర్చుకోండని కామెంట్ చేస్తున్నారు. పంత్ కారణంగా భారత్‌ ఓ రివ్యూ కోల్పోయిందని మండిపడ్డారు.

అంతేకాదు, బంగ్లాదేశ్‌ ను గెలిపించిన ముష్ఫికర్ రహీమ్ క్రీజులోకి వచ్చిన కాసేపటికే రెండుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అతడు ఎల్బీ అయినా పంత్ గుర్తించలేకపోయాడు. రన్ ఔట్ చేయలేక పోయాడు. ఎల్బీలను గుర్తించడంలో విఫలం కావడంతోపాటు రివ్యూను వేస్ట్ చేశాడంటూ సీరియస్ అవుతున్నారు. ఇలాంటి చిన్న పోరపాట్లతోనే  ఇండియా ఘోరంగా ఓడిపోయిందని చెబుతున్నారు. గెలుస్తుందనుకున్న మ్యాచ్ పోవడంతో రిషభ్‌ పంత్ అభిమానులకు మరోమారు టార్గెట్ అయ్యాడు. 3 టీ20ల సిరీస్ లో బంగ్లా 1-0 తేడాతో లీడ్ లో ఉండగా..సెకండ్ టీ20 ఈ నెల 7న జరగనున్న విషయం తెలిసిందే.

Latest Updates