సెమీస్‌లో ఇండియా ఓటమి.. కివీస్ ఫైనల్‌కి..

వరల్డ్ కప్ నాకౌట్ దశలో కీలకమైన మ్యాచ్ లో భారత్ ఓడిపోయింది. న్యూజీలాండ్ చేతిలో కోహ్లీ సేన 18 రన్స్ తేడాతో ఓటమి పాలయ్యింది. 240 రన్స్ లక్ష్య సాధనలో 49.3 ఓవర్లలో 221 రన్స్ దగ్గర ఇండియా ఆలౌట్ అయింది.

ఇండియా ఇన్నింగ్స్ లో జడేజా 77, ధోనీ 50, పాండ్యా 32, రిషభ్ పంత్ 32 రన్స్ చేసి పోరాడారు. పిచ్ అనూహ్యంగా స్పందించడంతో కీలకమైన రోహిత్ శర్మ (1), విరాట్ కోహ్లీ(1), కేఎల్ రాహుల్ (1) వికెట్లను ఇండియా మొదట్లోనే కోల్పోయింది. దీంతో భారత్ ఎదురుదెబ్బ తగిలింది. ఐతే… జడేజా పోరాటంతో ఆశలు చిగురించాయి. ధోనీ ని గప్తిల్ అద్భుతమైన త్రోతో రనౌట్ చేయడంతో ఇండియా ఓటమి ఖాయమైంది.

అంతకుముందు మంగళవారం ఆట కొనసాగించిన న్యూజీలాండ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239రన్స్ చేసింది.

Latest Updates